దళిత యువకుల బట్టలూడదీసీ..జననాంగాలపై పెట్రోల్ పోసీ..

దొంగతనం చేశారని ఇద్దరు దళిత యువకుల బట్టలూడదీని..దారుణంగా హింసించిన ఘటన రాజస్థాన్ నాగౌర్ గ్రామంలోని చోటు చేసుకుంది. నాగౌర్ గ్రామంలోని పెట్రోల్ బంక్ లో బంక్ సిబ్బంది ఆదివారం (ఫిబ్రవరి 16,2020)న జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అంతటితో వారి ఆగడాలు ఆగలేదు. ఆ దళిత యువకుల జననాంగాలపై పెట్రోల్ పోసారు. నిప్పు పెట్టేస్తామని బెదిరించారు. దీంతో బాధితులు హడలిపోయారు.
వివరాల్లోకి వెళితే..జైపూర్ నుండి 230 కిలోమీటర్ల దూరంలో ఉన్న పెట్రోల్ బంక్ కు 24 సంవత్సరాల వయస్సున్న ఓ దళిత యువకుడు ఆదివారం తన సోదరుడితో కలిసి వెళ్లాడు. అక్కడ ఉన్న కొంతమంది వీరిద్దరినీ చూశారు. తరువాత వారిపై దాడికి దిగారు. ఓ టూవీరల్ షాపు నుంచి డబ్బుని దొంగతనం చేశారంటూ సదరు షోరూమ్ కు చెందిన సిబ్బంది దళిత యువకులపై దాడికి దిగారు. యువకులిద్దరి బట్టలూడదీసి, జననాంగాలపై పెట్రోల్ పోశారు. ఈ దృశ్యాలు అక్కడున్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఆ తర్వాత ఈ వీడియోలు వైరల్ అయ్యాయి.
ఈ ఘటనపై బాధిత యువకులు ఇద్దరూ బుధవారం (ఫిబ్రవరి 19,2020) పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. దాడికి పాల్పడ్డ ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Read More>>ఏప్రిల్ 1 నుంచి దేశంలో క్లీనెస్ట్ పెట్రోల్, డీజిల్