కారులో సజీవదహనం.. తల్లితో సహా ఇద్దరు కూతుళ్లు

  • Published By: veegamteam ,Published On : March 11, 2019 / 10:30 AM IST
కారులో సజీవదహనం.. తల్లితో సహా ఇద్దరు కూతుళ్లు

Updated On : March 11, 2019 / 10:30 AM IST

ఆదివారం తూర్పు ఢిల్లీలోని అక్షరధామ్ ఫ్లైవర్ వద్ద విషాదం చోటుచేసుకుంది. సంతోషంగ దేవుడి దర్శనానికి వెళుతున్న కుటుంబాన్ని మృత్యువు వెంటాడింది. ఢిల్లీకి చెందిన ఉపేంద్ర మిశ్రా, రంజన మిశ్రా దంపతులు తన ముగ్గురు కుమార్తెలతో కలిసి అక్షర్‌ధామ్ ఆలయానికి బయల్దేరారు. ఒక్కసారిగా కారులో మంటలు చెలరేగి.. తల్లి ఇద్దరు కూతుళ్లతో సహా సజీవదహనంకాగా.. మరో ఇద్దరు గాయాలతో బయటపడ్డారు. కారు అక్షరధామ్ ఫ్లై ఓవర్‌పైకి రాగానే ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు చుట్టుముట్టడంతో.. రంజన మిశ్రా ఇద్దరు కూతుళ్లు సజీవదహనమయ్యారు. 

ప్రమాదంలో కారును డ్రైవింగ్ చేస్తున్నఉపేంద్ర మిశ్రా.. ముందు సీట్లో కూర్చొన్న మరో కుమార్తెను తీసుకొని బయటకు వెళ్లిపోయాడు. వీరిద్దరికి గాయాలుకాగా.. వెంటనే దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. భర్త షాక్ స్థితిలో ఉన్నాడని డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ (ఈస్ట్) జస్మీత్ సింగ్ చెప్పారు. CNG గ్యాస్‌ లీక్‌ కావడం వల్లే మంటలు చెలరేగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. 

ప్రమాదం జరిగిన వెంటనే అక్కడి స్థానికులు కారు డోర్లను తెరిచే ప్రయత్నం చేశారు. కాని మంటల బాగా రావడంతో కారు దగ్గరకు కూడా వెళ్లలేని పరిస్థితి ఎదురయ్యింది. విషయం తెలుసుకున్న ట్రాఫిక్‌ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటల్ని అదుపు చేశారు.