Yong woman Cuts Tongue : నాలుక కోసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టిన యువతి

నాలుక కోసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టింది ఓ యువతి.

Yong woman Cuts Tongue : నాలుక కోసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టిన యువతి

Woman Cuts Off Her Tongue

Updated On : June 24, 2022 / 5:59 PM IST

Woman cuts off her tongue: దేవుళ్లకు భక్తులు ఎన్నో మొక్కులు మొక్కుకోవటం వాటిని తీర్చుకోవటం సర్వసాధారణంగా జరుగేదే. కానీ కొంతమంది మాత్రం భక్తి పేరుతో కాస్త అత్యుత్సాహం చూపిస్తుంటారు. అటువంటి ఘటనే జరిగింది మధ్యప్రదేశ్​లోని సీధీ జిల్లాలో. జిల్లాలోని బడా అనే గ్రామంలో ఓ యువతి తన నాలుకను కోసి అమ్మవారి పాదాలకు సమర్పిచింది. సదరు యువతి చేసిన పని స్థానికంగా సంచలనంగా మారింది.

సిహవాల్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని బడా గ్రామానికి చెందిన 20 ఏళ్ల రాజ్​కుమారీ పటేల్​.. గురువారం (జూన్ 23,2022) తల్లిదండ్రులతో పాటు స్థానికంగా ఉండే కాళీమాత అమ్మవారి ఆలయానికి వచ్చింది. పూజ చేస్తుండగా ఉన్నట్లుండి యువతి తన నాలుకను కోసేసుకుని అమ్మవారి విగ్రహం పాదాల వద్దకు విసిరేసింది. ఈ ఘటనతో ఆమె తల్లిదండ్రులతో పాటు అక్కడ ఉన్న భక్తులంతా షాకయ్యారు.

కొన్ని క్షణాలకు తేరుకున్న తల్లి పెద్ద పెద్దగా కేకలు వేయటంతో అక్కడున్నవారంతా విషయం తెలుసుకుని ఆశ్చర్యపోయారు.వెంటనే ఆస్పత్రికి తరలించారు.యువతికి ప్రాథమిక చికిత్స చేసిన వైద్యులు ఆమెకు ఎలాంటి ప్రమాదం లేదని చెప్పగా తల్లిదండ్రులు ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అమ్మవారికి బలి ఇవ్వాలనే ఇలా చేసిందని పోలీసులు వెల్లడించారు.