AIIMS Delhi Hospital : ఢిల్లీ ఎయిమ్స్‌లో అగ్ని ప్రమాదం

దేశ రాజధాని ఢిల్లీలోని ఎయిమ్స్ (AIIMS‌) ఆస్పత్రి 9వ అంతస్తులో బుధవారం రాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. వివిధ డయాగ్నొస్టిక్‌ ల్యాబ్‌లు, టెస్టింగ్ సెక్షన్ బిల్డింగ్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

AIIMS Delhi Hospital : ఢిల్లీ ఎయిమ్స్‌లో అగ్ని ప్రమాదం

Aiims Delhi

Updated On : June 17, 2021 / 7:17 AM IST

AIIMS Delhi Hospital Fire  : దేశ రాజధాని ఢిల్లీలోని ఎయిమ్స్ (AIIMS‌) ఆస్పత్రి 9వ అంతస్తులో బుధవారం రాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. వివిధ డయాగ్నొస్టిక్‌ ల్యాబ్‌లు, టెస్టింగ్ సెక్షన్ బిల్డింగ్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

మంటలు చెలరేగిన వెంటనే 22 మంది అగ్నిమాపక యంత్రాలను తరలించారు. అగ్నిప్రమాదం జరిగిన చోట ఎయిమ్స్ సెట్ సౌకర్యం, ఆడిటోరియం ఉన్నాయని ఢిల్లీ ఫైర్‌ సర్వీస్‌ డైరెక్టర్‌ అతుల్‌ గార్గ్‌ చెప్పారు.

కొవిడ్‌-19 శాంపిల్స్ సేకరించిన ప్రాంతంలో మంటలు చెలరేగాయి. రాత్రి రూ.10.30 గంటల సమయంలో తమకు అగ్నిప్రమాదం జరిగినట్టు అత్యవసర సమాచారం వచ్చిందని డిప్యూటీ చీఫ్‌ ఫైర్‌ ఆఫీసర్ సునీల్‌ చౌదరి తెలిపారు. వెంటనే 22 ఫైర్‌ టెండర్లను తరలించి మంటలను అదుపులోకి తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు. ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదని తెలిపారు.