ఎయిర్ పోర్టులో 24కిలోల బంగారం 

  • Published By: veegamteam ,Published On : January 12, 2019 / 08:33 AM IST
ఎయిర్ పోర్టులో 24కిలోల బంగారం 

చెన్నై : బంగారం అక్రమ రవాణాపై కస్టమ్స్ అధికారులు నిఘా పెట్టారు. ఈ క్రమంలో నగరంలోని  ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో 24కిలోల బంగారం తరలిస్తుండగా కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు.  ఇద్దరు ప్రయాణికులు వద్ద నుండి స్వాధీనం చేసుకున్న ఈ బంగారం ఖరీదు రూ.8కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. 
ఎయిర్‌ ఇంటెలిజెన్స్‌ విభాగానికి (ఏఐయూ) చెందిన కస్టమ్స్‌ అధికారులు తనిఖీలు చేపట్టిన క్రమంలో భారీ మొత్తంలో దొరికిన 24 కిలోల బంగారాన్ని అధికారులు  సీజ్‌ చేశారు. బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను దక్షిణా కొరియాకు చెందిన వారు హాంకాంగ్‌ నుంచి చెన్నైకు వచ్చిన క్రమంలో అక్రమంగా తరలిస్తున్న  బంగారాన్ని అధికారులు సీజ్ చేసి అనంతరం దర్యాప్తు చేపట్టారు.