Madhya Pradesh: ఒకే సిరంజీతో 30మంది విద్యార్థులకు వ్యాక్సిన్
మధ్యప్రదేశ్‌లోని ఓ స్కూల్ లో 30 మంది విద్యార్థులకు ఒకే సిరంజీతో వ్యాక్సిన్ ఇచ్చారు. సీఎంహెచ్ఓ డీకే గోస్వామి.. తనకు ఈ విషయంపై కంప్లైంట్ వచ్చిందని విచారణ జరుగుతుందని చెప్పారు. ఏదైనా పొరబాటు జరిగిందని తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Covid 19 Vaccine
Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లోని ఓ స్కూల్ లో 30 మంది విద్యార్థులకు ఒకే సిరంజీతో వ్యాక్సిన్ ఇచ్చారు. సీఎంహెచ్ఓ డీకే గోస్వామి.. తనకు ఈ విషయంపై కంప్లైంట్ వచ్చిందని విచారణ జరుగుతుందని చెప్పారు. ఏదైనా పొరబాటు జరిగిందని తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
సాగర్ సిటీలోని జైన్ పబ్లిక్ హయ్యర్ సెకండరీ స్కూల్ లో కొవిడ్ వ్యాక్సినేషన్ క్యాంప్ సమయంలో ఈ ఘటన జరిగింది. 30మంది విద్యార్థులకు ఒకే సిరంజీతో వ్యాక్సిన్ తీసుకుంటుండటం చూసిన పేరెంట్స్ ఫిర్యాదు చేశారు. కొవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించిన ఏఎన్ఎమ్ జితేంద్ర రాయ్.. స్పందిస్తూ తనకు డిపార్ట్‌మెంట్ హెడ్ నుంచి ఒకేసిరంజీతో వ్యాక్సిన్ వేయాలంటూ ఆదేశాలు అందాయని పేర్కొన్నాడు.
“వాళ్లు కేవలం ఒక సిరంజీ మాత్రమే ఇచ్చారు. నేనడిగితే అదే చెప్పారు. అందుకే 30మంది విద్యార్థులకు ఒకే సిరంజీతో వ్యాక్సిన్ ఇచ్చాను” అని పేర్కొన్నాడు.
Read Also : మధ్యప్రదేశ్ లోని ఇసుక క్వారీలో బయటపడ్డ 164 పురాతన నాణేలు
సాగర్ జిల్లా యాజమాన్యం ఈ ఘటన గురించి జితేంద్రపై ఫిర్యాదు చేయగా ఎఫ్ఐఆర్ నమోదైంది. సెంట్రల్ గవర్నమెంట్ వన్ నీడిల్, వన్ సిరంజీ, వన్ టైం నిబంధనను అతిక్రమించడం పట్ల కేసు ఫైల్ అయింది. డిపార్ట్‌మెంటల్ ఎంక్వైరీ జరుపుతున్నామని.. వ్యాక్సిన్లు పంపేందుకు ఇన్‌ఛార్జ్‌గా ఉన్న డిస్ట్రిక్ట్ ఇమ్యూనైజేషన్ ఆఫీసర్ డా. రాకేశ్ రోషన్ ఎంక్వైరీకి ఆదేశించారని అన్నారు.