Madhya Pradesh: బస్సు-ట్రాలీ ఢీ… నలుగురి మృతి, 15 మందికి తీవ్రగాయాలు

ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే సహాయక బృందాలు, పోలీసులు అక్కడకు చేరుకున్నారు.

Madhya Pradesh: బస్సు-ట్రాలీ ఢీ… నలుగురి మృతి, 15 మందికి తీవ్రగాయాలు

ప్రతీకాత్మక చిత్రం

Updated On : May 18, 2023 / 11:31 AM IST

Bus Accident: మధ్యప్రదేశ్ లో ఘోర బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న స్లీపర్ బస్ (sleeper bus), ఓ ట్రాలీ ఢీకొన్నాయి. దీంతో నలుగురు ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో మరో 15 మందికి తీవ్రగాయాలయ్యాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

ప్రమాద ధాటికి బస్సు నుజ్జునుజ్జయింది. దాన్న రోడ్డుపై నుంచే తొలగించారు. మధ్యప్రదేశ్ నుంచి అహ్మదాబాద్ వెళ్తున్న స్లీపర్ బస్ షాజాపూర్ (Shajapur) వద్ద ట్రాలీకి ఢీ కొందని అధికారులు గుర్తించారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే సహాయక బృందాలు, పోలీసులు అక్కడకు చేరుకున్నారు.

గాయాలపాలైనవారిని వెంటనే ఉజ్జయిలోని ఆసుపత్రులకు తరలించారు. ఈ ప్రమాదంలో కోల్పోయిన నలుగురి వివరాల గురించి తెలియరాలేదు. బస్సు, ట్రాలీ వేగంగా రావడమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. ఈ ప్రమాద ఘటనపై అధికారులు విచారణ ప్రారంభించారు.

Viral Video: నీటి సంక్షోభం… బిందెలతో బావి చుట్టూ మహిళలు