600 గ్రాముల నకిలీ పసుపు కేసు..38 ఏళ్ల తర్వాత తీర్పు

  • Published By: madhu ,Published On : August 19, 2020 / 11:25 AM IST
600 గ్రాముల నకిలీ పసుపు కేసు..38 ఏళ్ల తర్వాత తీర్పు

Updated On : August 19, 2020 / 12:21 PM IST

ఒక సంవత్సరం కాదు..రెండు సంవత్సరాలు కాదు..ఏకంగా 38 ఏళ్ల తర్వాత తీర్పు వెలువరించింది. తనకు న్యాయం జరిగేంత వరకు పోరాటం చేసి విజయం సాధించాడు. ప్రస్తుతం అతని వయస్సు 76 ఏళ్లు. 600 గ్రాముల నకిలీ పసుపులో కేసులో ఇది జరిగింది.



1982లో ఈ కేసు బుక్ అయ్యింది. 1982లో అరెస్టయిన..నిందితుడి భవితవ్యం సుప్రీంకోర్టు ఇప్పుడు తీర్చింది. అతడిని దోషిగా తేల్చేయడంతో ఫుల్ హ్యాపీ అయ్యాడు. హర్యాణాలో సోనిపట్ కు చెందిన ప్రేమ్ చంద్ వ్యక్తి కిరాణ కొట్టు వ్యవహరిస్తున్నాడు. 1982లో ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేశారు.



పసుపులో కొన్ని పురుగులు ఉండడం గమనించారు. దీంతో అధికారులు కేసు బుక్ చేశారు. పసుపులో కొన్ని పురుగులు ఉంటాయి..ఇంకేమన్నా ఉంటాయా ? అని ప్రశ్నించాడు. పోలీసులు అతడిని అరెస్టు చేశారు. అతడికి కోర్టు బెయిల్ ఇచ్చేసింది.



కానీ..13 ఏళ్ల తర్వాత…1995లో కేసును మరలా కదిల్చాడు. ప్రేమ్ చంద్ నిర్దోషి అని స్థానిక కోర్టు తీర్పునిచ్చింది. ఇక్కడ ప్రభుత్వం హైకోర్టు మెట్లు ఎక్కింది. హైకోర్టు 2009లో అతణ్ని దోషిగా తేల్చింది. కల్తీ పసుపు అమ్మినందుకు, లైసెన్సు లేకుండా వ్యాపారం చేస్తున్నందుకు ఆరున్నర నెలల జైలు శిక్ష, రూ. 2500 జరిమానా వేసింది.



జైలుకు మాత్రం వెళ్లను..ఫైన్ కడుతానంటూ..సుప్రీంకోర్టుకు వెళ్ళాడు ప్రేమ్ చంద్. ప్రేమ్ చంద్ నేరం చేశాడని పక్కా ఆధారాలు లేవని సుప్రీంకోర్టు వెల్లడించింది. అతడు నిర్దోషిగా తేల్చింది. 38 ఏళ్ల కేసు పరిష్కారమైందని ప్రేమ్ చంద్ సంతోషం వ్యక్తం చేశాడు.