లోక్ సభ ఎన్నికలు :బీజాపూర్ లో నలుగురు నక్సల్స్ అరెస్ట్

బీజాపూర్ : చత్తీస్ గఢ్ లో లోక్ సభ ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో బీజాపూర్ లో నలుగురు మావోయిస్ట్ లను భద్రతాదళాల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గురువారం (ఏప్రిల్ 11) ఉదయం పోలింగ్ ప్రారంభం కావటానికి సమయం దగ్గర పడుతున్న క్రమంలో బెంద్రే ప్రాంతంలో ఆయుధాలతో సంచరిస్తున్న నక్సలైట్లను అరెస్ట్ చేసామని పోలీసులు వెల్లడించారు. వారిని అరెస్ట్ చేసిన అనతరం వారి వద్ద నుంచి మూడు నాటు తుపాకులను కూడా స్వాధీనం చేసున్నారు. కాగా అరెస్ట్ అయిన మావోయిస్టుల గుర్తింపు వివరాలు ఇంకా వెల్లడికాలేదు.
తొలిదశ లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా ఇవాళ దేశ వ్యాప్తంగా మొత్తం 91 నియోజకవర్గాల్లో పోలింగ్ కొనసాగుతోంది. బీజాపూర్ బస్తర్ లోక్‌సభ నియోజకవర్గం కిందికి వస్తుంది. కాగా నక్సల్స ప్రభావిత ప్రాంతమైన బీజాపూర్ లో 80 వేల మంది భద్రతా సిబ్బందితో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా చత్తీస్ గఢ్ లోని పలు నక్సల్స్ ప్రాంతాలలో ఈసీ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిన విషయం తెలిసిందే. పోలింగ్ సమయం ముగిసే వరకూ ఆయా జిల్లాల కలెక్టర్లు, పోలీసులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో అణువణును పరిశీలిస్తున్న పోలీసులు నలుగురు మావోయిస్టును అరెస్ట్ చేశారు.