ఢిల్లీ మెట్రో స్థలాన్నే తాకట్టు పెట్టి లోన్ తీసుకున్నారు

  • Published By: venkaiahnaidu ,Published On : October 25, 2020 / 06:39 PM IST
ఢిల్లీ మెట్రో స్థలాన్నే తాకట్టు పెట్టి లోన్ తీసుకున్నారు

Updated On : October 25, 2020 / 7:14 PM IST

4 Of Family Mortgaged Delhi Metro Land బ్యాంకు లోను కోసం ఓ కుటుంబంలోని నలుగురు సభ్యులు ఏకంగా ఢిల్లీ మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ స్థలాన్నే తాకట్టు పెట్టారు. మెట్రో స్థలం ఒక్కటే కాదు.. ఎక్కడెక్కడో ఉన్న భూములను ఎంచుకొని, నకిలీ పట్టాలు సృష్టించి, వాటినే మళ్లీ మళ్లీ తాకట్టు పెట్టి బ్యాంకులకు కుచ్చుటోపీ పెట్టారు. రూ. 20 కోట్లకు పైగా లోన్లు తీసుకొని ఉడాయించారు.



2016లో వెస్ట్ ఢిల్లీలోని నరియానాలోని పంజాబ్‌ అండ్‌ సింధ్‌ బ్యాంకు జోనల్‌ మేనేజర్‌ ఫిర్యాదుతో వీరి మోసం వెలుగులోకి వచ్చింది. అప్పటి నుంచి నిందితులు అశ్వనీ అరోరా, విజయ్‌ అరోరా, వారి భార్యలు పరారీలో ఉన్నారు. నాలుగేళ్లుగా పరారీలో ఉన్న వీళ్లను విశ్వసనీయ సమాచారం మేరకు శనివారం ఢిల్లీ పోలీసులు ఢిల్లీ, ఘజియాబాద్‌లో వేర్వేరు చోట్ల వీరిని అరెస్టు చేశారు. డాక్యుమెంట్లను ఫోర్జరీ చేసి, ఒకే ప్రాపర్టీలను పలుసార్లు తాకట్టు పెట్టి వీళ్లు లోన్లు తీసుకున్నారని పోలీసులు తెలిపారు.