Kochi Stampede : కేరళ కొచ్చిన్ యూనివర్సిటీ ఫెస్టివల్ లో తొక్కిసలాట.. నలుగురు విద్యార్థులు మృతి, 64 మందికి గాయాలు

కొచ్చిన్ యూనివర్శిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్ నిర్వహిస్తున్న వార్షిక టెక్ ఫెస్టివల్ రెండవ రోజు కోసం 2,000 మందికి పైగా ప్రజలు, వివిధ కళాశాలల విద్యార్థులు, స్థానికులు వేదిక వద్ద ఉన్నట్లు అంచనా వేశారు.

Kochi Stampede : కేరళ కొచ్చిన్ యూనివర్సిటీ ఫెస్టివల్ లో తొక్కిసలాట.. నలుగురు విద్యార్థులు మృతి, 64 మందికి గాయాలు

Kochi University Festival Stampede

Kochi Cusat University Festival Stampede : కేరళ కొచ్చిలో యూనివర్సిటీ ఫెస్టివల్ లో జరిగిన తొక్కిసలాటలో నలుగురు విద్యార్థులు మృతి చెందారు. కొచ్చిలోని కొచ్చిన్ యూనివర్శిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (కుశాట్)లో శనివారం ఓపెన్ ఎయిర్ టెక్ ఫెస్టివల్ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో నలుగురు విద్యార్థులు మృతి చెందగా, 64 మందికి గాయాలు అయ్యాయి. గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

మృతులు అతుల్ తంబి, ఆన్ రుఫ్తా, సారా థామస్, ఆల్విన్ జోసెఫ్‌లుగా గుర్తించారు. ఆల్విన్ మినహా మిగిలిన ముగ్గురు విద్యార్థులు కొచ్చిన్ యూనివర్శిటీలో ఇంజనీరింగ్ చదువుతున్నారు. కొచ్చిన్ యూనివర్శిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్ నిర్వహిస్తున్న వార్షిక టెక్ ఫెస్టివల్ రెండవ రోజు కోసం 2,000 మందికి పైగా ప్రజలు, వివిధ కళాశాలల విద్యార్థులు, స్థానికులు వేదిక వద్ద ఉన్నట్లు అంచనా వేశారు.

STORY | Four students died and several others were injured in a stampede at Cochin University in Kerala. The tragedy occurred during the university’s anniversary celebrations.

READ: https://t.co/jM5UEXxbmk

VIDEO: pic.twitter.com/Cmh8Tqog7c

— Press Trust of India (@PTI_News) November 25, 2023

Surat : సూరత్ రైల్వే స్టేషనులో తొక్కిసలాట, ఒకరి మృతి, పలువురికి గాయాలు

సంఘటనా స్థలంలోని ప్రత్యక్ష సాక్షులు, పోలీసు సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం ఈ సంఘటన రాత్రి 7 గంటలకు జరిగిందని అండ్ ఆర్డర్ ఏడీజీపీ ఎంఆర్ అజిత్ కుమార్ తెలిపారు. 1,500 మంది వరకు కూర్చునే సామర్థ్యం ఉన్న యాంఫిథియేటర్ ఆ సమయంలో పాక్షికంగా నిండిపోయిందని ఏడీజీపీ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విద్యార్థులే స్వయంగా నిర్వహిస్తూ నియంత్రించారని, యూనివర్సిటీలో ఆరుగురు పోలీసులు విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు.

ప్లేబ్యాక్ సింగర్ నిఖితా గాంధీ విశ్వవిద్యాలయంలోని యాంఫిథియేటర్‌లో ప్రదర్శన ఇవ్వాల్సి ఉంది. అప్పుడే వర్షం ప్రారంభమైంది. వర్షం పడడంతో వెలుపల ఉన్న ప్రేక్షకులు ఒక్కసారిగా ఒకే గేట్ ద్వారా యాంఫీథియేటర్‌లోకి దూసుకెళ్లారు. దీంతో లోపల నిలబడి ఉన్నవారు మెట్లు దిగుతుండంగా తొక్కిసలాట జరిగినట్లు తెలుస్తోంది. యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్ విద్యార్థులు వార్షిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కుశాట్ వైస్ ఛాన్సలర్ డాక్టర్ పీజీ శంకరన్ తెలిపారు.

కరోనా మహమ్మారి తర్వాత మొదటి సంవత్సరం ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్త పర్యటనలో ఉన్న కేరళ కేబినెట్ పరిస్థితిని సమీక్షించేందుకు కోజికోడ్‌లో అత్యవసర సమావేశం అయ్యారు. ఉన్నత విద్యాశాఖ మంత్రి డాక్టర్‌ ఆర్‌ బిందు, పరిశ్రమల శాఖ మంత్రి పి రాజీవ్‌ కొచ్చికి బయలుదేరారు. మరోవైపు కొచ్చిలోని అన్ని ఆసుపత్రులను అప్రమత్తం చేశామని అధికారులు తెలిపారు. త్రిసూర్‌లోని మెడికల్ కాలేజీ ఆసుపత్రి నుండి వైద్యులను రప్పించామని పేర్కొన్నారు.