ప్రైవేట్ బస్సు బోల్తా…20మంది పరిస్థితి విషయం

  • Published By: venkaiahnaidu ,Published On : December 13, 2020 / 10:56 PM IST
ప్రైవేట్ బస్సు బోల్తా…20మంది పరిస్థితి విషయం

Updated On : December 14, 2020 / 11:18 AM IST

bus overturns near Odisha’s Kalahandi district                                                 ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం(డిసెంబర్-13,2020)ఒడిశాలోని కలహండి జిల్లా ధర్మాఘర్‌ నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు కోక్‌సొర ప్రాంతంలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 40 మంది ప్రయాణికులకి గాయాలవ్వగా..20 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

కాగా, ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని స్థానికుల సహాయంతో క్షతగాత్రులను సమీపంలోని హాస్పిటల్ కు తరలించారు. భారీ మలుపును డ్రైవర్‌ గుర్తించలేకపోవడం వల్లనే ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధరించారు.