దేశాన్నే ఆందోళనలో పడేశారు : నిజాముద్దీన్ ఈవెంట్ కు హాజరైన వారికోసం భారీ వేట ప్రారంభం…448మందిలో కరోనా లక్షణాలు

  • Published By: venkaiahnaidu ,Published On : March 31, 2020 / 12:41 PM IST
దేశాన్నే ఆందోళనలో పడేశారు : నిజాముద్దీన్ ఈవెంట్ కు హాజరైన వారికోసం భారీ వేట ప్రారంభం…448మందిలో కరోనా లక్షణాలు

Updated On : March 31, 2020 / 12:41 PM IST

ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతానికి చెందిన తగ్లిబీ జమాత్ నిర్వహించిన మతపరమైన సమావేశానికి హాజరైన వారిలో దాదాపు 448మందిలో కరోనా లక్షణాలు బయటపడ్డాయని మంగళవారం(మార్చి-31,2020) ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తెలిపారు. మార్చి-1నుంచి 15వరకు నిజాముద్దీన్ లోని మర్కజ్ బిల్డింగ్ లో నిర్వహించిన ఈ సమ్మేళనానికి హాజరైన వారిలో 1107మందిని క్వారంటైన్ కు తరలించినట్లు కేజ్రీవాల్ తెలిపారు. ఇంకా మర్కజ్ బిల్డింగ్ లో ఉన్న కొంతమందిని తరలించవలసి ఉందని తెలిపారు,

ఈ కార్యక్రమ నిర్వహకులపై ఎఫ్ఐఆర్ నమోదుచేయాలని నిన్నరాత్రే తాను ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ తో చెప్పిన విషయాన్ని కేజ్రీవాల్ గుర్తుచేశారు. ప్రపంచాన్ని కరోనా వైరస్ వణికిస్తున్న సమయంలో ఇంత పెద్ద ఈవెంట్ ను నిర్వహించడం ముమ్మాటికీ తప్పేనని ఢిల్లీ సీఎం సృష్టం చేశారు. ఢిల్లీ ప్రజల ప్రాణాలను, అదేవిధంగా దేశప్రజల ప్రాణాలను ఈ కార్యక్రమ నిర్వాహకులు ఆందోళనలో పెట్టారని కేజ్రీవాల్ ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీలోని 97కరోనా కేసుల్లో 24కేసులు ఈ కార్యక్రమానికి హాజరైన వారే అని కేజ్రీవాల్ చెప్పారు.

మలేషియా,ఇండోనేషియా,సౌదీ అరేబియా సహా పలు ఇతర దేశాలు,భారత్ లోని వివిధ రాష్ట్రాల నుంచి 2వేలకు మందికిపైగా ఈ కార్యక్రమానికి హాజరైనట్లు సమాచారం. సదస్సుకు వారం ముందే విదేశీయులు ఢిల్లీకి చేరుకున్నారు. విదేశీయుల నుంచి ఇతరులకు వైరస్ సోకింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన 24మందికి కరోనా సోకినట్లు మంగళవారం(మార్చి-31,2020)తేలింది. తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. తెలంగాణ,జమ్మూకశ్మీర్ రాష్ట్రాలకు చెందినవారు ప్రాణాలు కోల్పోయినవారిలో ఉన్నారు.

అయితే ఇప్పుడు దేశవ్యాప్తంగా ఢిల్లీ ఈవెంట్ కు హాజరైన వారు,వారిని కలిసినవారిని గుర్తించే భారీ వేటలో పడింది భారత్. తబ్లిగి జమాత్ సభ్యులు చౌకైన రవాణా మార్గాల్లో ప్రయాణించేవారు కాబట్టి వారు ఎక్కువ మందికి చేరుకోవచ్చు. వారు మసీదులలో ఉపన్యాసాలు ఇవ్వడంతో పాటు స్థానికంగా మతపరమైన ‘ఇజ్తిమాస్’ (సమ్మేళనాలు) ను కూడా నిర్వహించారు. ఇప్పుడు వారి కోపసం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు పెద్ద వేట మొదలెట్టాయి. మరోవైపు కేంద్రహోంశాఖ ఈ ఇష్యూపై సీరియస్ గా దృష్టిసారించింది. ఈ కార్యక్రమానికి హాజరైనవారందరూ వెంటనే హాస్పిటల్స్ కు వెళ్లాలని అధికారులు విజ్ణప్తి చేశారు.

ఢియూపీ నుంచి ఢిల్లీ తగ్లిబ్ జమాత్ ఈవెంట్ కు హాజరైనవారిలో 95శాతంమందిని గుర్తించినట్లు ఇవాళ మధ్యాహ్నాం ఉత్తరప్రదేశ్ అడిషనల్ చీఫ్ సెక్రటరీ అవనీష్ అవస్తీ తెలిపారు. ఈ రోజు రాత్రికల్లా మిగిలినవారిని గుర్తిస్తామని ఆయన తెలిపారు. 157మంది ఉత్తరప్రదేశ్ నుంచి ఈ కార్యక్రమానికి హాజరయ్యారని,145మందిని గుర్తించామని,ఇంకా ఓ 12మందిని గుర్తించేపనిలో ఉన్నట్లు తెలిపారు. మొత్తం 157మందికి కరోనా టెస్ట్ లు చేయనున్నట్లు ఆయన తెలిపారు.