Delta Plus Variant : మహారాష్ట్రలో 45 కోవిడ్ డెల్టా ప్లస్ కేసులు
మహారాష్ట్రలో ఆగస్టు8 వరకు మొత్తం 45 కోవిడ్ డెల్టా ప్లస్ కేసులు నమోదైనట్లు ఇవాళ ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది.

Cv2
Delta Plus Variant మహారాష్ట్రలో ఆగస్టు8 వరకు మొత్తం 45 కోవిడ్ డెల్టా ప్లస్ కేసులు నమోదైనట్లు ఇవాళ ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది. అత్యధికంగా జలగావ్ జిల్లాలో 13 డెల్టా ప్లస్ కేసులు నమోదయ్యాయని,రత్నగిరి జిల్లాలో 11 కేసులు,ముంబైలో 6 కేసులు,థానేలో 5కేసులు,పూణేలో మూడు కేసులు నమోదైటనట్లు ఆరోగ్యశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపిన శాంపిల్స్ లో 80 శాతం కరోనా డెల్టా ప్లస్ పాజిటివ్ గా తేలియాని ప్రకటనలో తెలిపారు.
మరోవైపు,రాష్ట్రంలో ప్రతిఒక్కరూ తప్పనిసరిగా కోవిడ్ ప్రొటోకాల్స్ పాటించాలని సీఎం ఉద్దవ్ ఠాక్రే సూచించారు. కోవిడ్ ఇంకా ఉందని,త్వరలో పండుగల నేపథ్యంలో అందరూ జాగ్రత్తగా ఉండాలని అన్నారు. డెల్టా వేరియంట్ చాలా వేగంగా వ్యాపిస్తోందని తెలిపారు. పూణే,అహ్మద్ నగర్,సోలాపూర్,సంగ్లీ,సతారా,సింధుదర్గ్,రత్నగిరి జిల్లాలు మరింత మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ జిల్లాల్లోని పాలనా యంత్రాంగం యొక్క జవాబుదారీతనం ఎక్కువ అని ఆయన అన్నారు.
ఇక,ఇవాళ మహారాష్ట్రలో 5,508 కొత్త కోవిడ్ కేసులు నమోదుకాగా,151కోవిడ్ మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన కేసుల సంఖ్య 63,53,328కి చేరుకోగా,మరణాల సంఖ్య 13,39,96కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 71,510 యాక్టివ్ కరోనా కేసులున్నాయి. రాష్ట్రంలో రికవరీ రేటు 96.71శాతం ఉండగా,మరణాల రేటు 2.1శాతంగా ఉంది.