Fire In RTC Bus : బస్సులో అగ్నిప్రమాదం .. కండక్టర్ సజీవ దహనం

బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ బస్సులో మంటలు చెలరేగడంతో ముత్తయ్య స్వామి అనే కండక్టర్ సజీవ దహనమయ్యారు. 80 శాతం కాలిపోవటంతో 45 ఏళ్ల ముత్తయ్య మరణించారు.

Fire In RTC Bus : బస్సులో అగ్నిప్రమాదం .. కండక్టర్ సజీవ దహనం

Fire In bus

Updated On : March 10, 2023 / 5:36 PM IST

Fire In RTC Bus : మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ బస్సులో మంటలు చెలరేగాయి. దీంతో బస్సులోనే నిద్రిస్తున్న కండక్టర్ సజీవంగా మంటలకు బలి అయిపోయారు. ఈ దారుణ ఘటన గురువారం (మార్చి9,2023) తెల్లవారుజామున 4.45 గంటలకు బెంగళూరులో చోటుచేసుకుంది. బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ బస్సులో మంటలు చెలరేగడంతో ముత్తయ్య స్వామి అనే కండక్టర్ సజీవ దహనమయ్యారు. 80 శాతం కాలిపోవటంతో 45 ఏళ్ల ముత్తయ్య మరణించారు.

డీసీపీ లక్ష్మణ తెలిపిన వివరాల ప్రకారం..డ్రైవర్ ప్రకాశ్ బస్సును లింగధీరనహళ్లి బస్‌స్టాండ్‌లోని డీ గ్రూప్ స్టాప్‌లో పార్క్ చేసి వెళ్లారు. బస్ స్టేషన్‌లో రెస్ట్ రూమ్ లో డ్రైవర్ ప్రకాశ్ నిద్రించారు. కానీ కండక్టర్ ముత్తయ్య మాత్రం బస్సులోనే నిద్రపోయారు. ఈ క్రమంలో ఓ రాత్రివేళ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో కండక్టర్ అగ్నికీలలకు బలైపోయారు. ముత్తయ్యకు 80 శాతం మేర కాలిన గాయాలయ్యాయని స్థానిక డీసీపీ వెల్లడించారు.