Cm Revanth Reddy: 70 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం.. భవిష్యత్తులో మరిన్ని భర్తీ చేస్తాం- సీఎం రేవంత్

ఏ రాజకీయ పార్టీ చేతిలో ఆయుధాలుగా మారకండి అని పిలుపునిచ్చారు. చిన్న వయసులోనే నాకు మంచి అవకాశం వచ్చింది. చాలా సంవత్సరాలు మీతోనే ఉంటాను.

Cm Revanth Reddy: 70 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం.. భవిష్యత్తులో మరిన్ని భర్తీ చేస్తాం- సీఎం రేవంత్

Cm Revanth Reddy Representative Image (Image Credit To Original Source)

Updated On : January 16, 2026 / 11:14 PM IST
  • రాబోయే రోజుల్లో మరిన్ని ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ
  • ప్రైవేట్ లోనూ భారీగా ఉద్యోగాలు
  • ఏ రాజకీయ పార్టీ చేతిలో ఆయుధాలుగా మారకండి
  • తల్లిదండ్రులను బాగా చూసుకోండి

 

Cm Revanth Reddy: నీళ్లు, నిధులు, నియామకాల కోసమే తెలంగాణ సాధించుకున్నామని సీఎం రేవంత్ అన్నారు. కానీ, గత పదేళ్లుగా నిరుద్యోగుల ఆశలు నెరవేరలేదన్నారు. ఇప్పుడున్న ప్రజా ప్రభుత్వం నిరుద్యోగ యువత కోసం పని చేస్తోందన్నారు. గ్రూప్-3 నోటిఫికేషన్ ఇస్తే 5 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని ముఖ్యమంత్రి రేవంత్ తెలిపారు. లక్షలాది నిరుద్యోగుల జీవితాలతో గత ప్రభుత్వం చెలగాటమాడిందని మండిపడ్డారు. మా ప్రభుత్వం రాగానే యూపీఎస్సీతో పోటీ పడేలా టీజీపీఎస్సీని ప్రక్షాళన చేశామన్నారు. ఈ రెండేళ్లలో 70వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామన్నారు. 1370 మంది గ్రూప్-3 విజేతలకు 25 ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు ఇచ్చామన్నారు.

హైదరాబాద్ శిల్పకలా వేదికలో కొలువుల పండగ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ పాల్గొన్నారు. టీజీపీఎస్సీ గ్రూప్-3 విజేతలకు నియామకపత్రాలను అందజేశారు సీఎం రేవంత్. తల్లిదండ్రులను బాగా చూసుకోవాలని ఆడపడుచులకు సీఎం రేవంత్ సూచించారు. అత్తగారి ఇంటికి వెళ్లినా మీ తల్లిదండ్రులను బాగా చూసుకునే బాధ్యత మీదే అని సీఎం రేవంత్ తేల్చి చెప్పారు. పేరెంట్స్ ను సరిగా చూసుకోకపోతే మీ జీతం నుంచి కొంత భాగం (10 నుంచి 15శాతం) వారికి చేరేలా నేను చూస్తానని సీఎం రేవంత్ అన్నారు. తల్లిదండ్రులను బాగా చూసుకోని వాడు తన దృష్టిలో, సమాజం దృష్టిలో మనిషి జన్మ ఎత్తడానికి అర్హత లేని వాడు అని అన్నారు. తల్లిదండ్రులను, పుట్టిన ఊరుని బాగా చూసుకునే వాడు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా అభివృద్ది చేస్తాడన్న నమ్మకం తనకుందన్నారు.

రాబోయే రోజుల్లో కూడా ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలు అన్నింటిని భర్తీ చేస్తామన్నారు. ఏ రాజకీయ పార్టీ చేతిలో ఆయుధాలుగా మారకండి అని పిలుపునిచ్చారు. ఎవరూ మనకు చెప్పాల్సిన పని లేదన్నారు. ”లక్షలాది కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చి ప్రభుత్వంలోనే కాదు ప్రైవేట్ లోనూ భారీగా ఉద్యోగాలు వచ్చేలా చూస్తాం. ప్రపంచంతోనే పోడీ పడే విధంగా మా యువకులను తీర్చిదిద్దే బాధ్యత నాకుంది. చిన్న వయసులోనే నాకు మంచి అవకాశం వచ్చింది. చాలా సంవత్సరాలు మీతోనే ఉంటాను. కావాల్సిన పనులు చేస్తాను” అని సీఎం రేవంత్ అన్నారు.