Covid cases in india: కరోనాతో చికిత్సపొందుతూ ఒకేరోజు 46 మంది మృతి..
దేశంలో కొవిడ్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. పాజిటివ్ కేసుల సంఖ్య తక్కువగా నమోదవుతున్నప్పటికీ.. 2వేలు మించి కేసులు నమోదవుతుండటం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. దేశంలో కొవిడ్ బారినపడి చికిత్సపొందుతూ ఆదివారం ఒక్కరోజే 46 మంది మృతిచెందారు...

Corina 19
Covid cases in india: దేశంలో కొవిడ్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. పాజిటివ్ కేసుల సంఖ్య తక్కువగా నమోదవుతున్నప్పటికీ.. 2వేలు మించి కేసులు నమోదవుతుండటం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. దేశంలో కొవిడ్ బారినపడి చికిత్సపొందుతూ ఆదివారం ఒక్కరోజే 46 మంది మృతిచెందారు. కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం.. దేశంలో కొత్తగా 2022 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 4,31,38,393కు చేరింది. ఇందులో 4,25,99, 102 మంది బాధితులు వైరస్ నుంచి కోలుకున్నారు. ఇదిలాఉంటే దేశంలో కొవిడ్ యాక్టివ్ కేసుల సంఖ్య 14,832 కు చేరింది. ఇప్పటి వరకు 5,24,459 మంది కొవిడ్ తో చికిత్స పొందుతూ మృతిచెందారు. తాజాగా గడిచిన 24 గంటల్లో 2,099 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. అయితే కొవిడ్ తో బాధపడుతూ చికిత్స పొందుతున్న వారిలో 46 మంది మృతిచెందారు.
Telangana Corona Cases Bulletin : తెలంగాణలో కొత్తగా ఎన్ని కరోనా కేసులు అంటే..
కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. రోజవారీ పాజిటివిటీ రేటు 0.69 శాతానికి పెరిగింది. అయితే మొత్తం కేసుల్లో 0.03 శాతం కేసులు త్రమే యాక్టివ్ ఉన్నాయి. రికవరీ రేటు 98.75 శాతం, మరణాల రేటు 1.22 శాతంగా ఉంది. ఇదిలా ఉంటే ఒమిక్రాన్ సబ్ వేరియంట్లయిన బీఏ4, బీఏ5లను దేశంలో తొలిసారిగా గుర్తించినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. తమిళనాడు, తెలంగాణలో ఈ తరహా కేసులు రెండు నమోదయ్యాయని, తమిళనాడుకు చెందిన 10ఏండ్ల యువతిలో బీ-4 వేరియంట్ బయటపడిందని అధికారులు తెలిపారు. ఆమె పూర్తిస్థాయిలో వ్యాక్సినేషన్ చేయించుకుందని, ఎలాంటి ప్రయాణాలు చేయలేదని అధికారులు వెల్లడించారు. ఇదిలా ఉంటే కొవిడ్ నివారణకు చేపట్టిన వ్యాక్సినేషన్ ను దేశవ్యాప్తంగా అధికారులు వేగవంతం చేశారు. ఇఫ్పటి వరకు దేశంలో 1,92,38,45,615 వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని, ఇందులో ఆదివారం ఒకేరోజు 8,81,668 మందికి వ్యాక్సినేషన్ చేశామని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది]
#AmritMahotsav#Unite2FightCorona#LargestVaccineDrive
𝗖𝗢𝗩𝗜𝗗 𝗙𝗟𝗔𝗦𝗛https://t.co/XfkUYKIKcx pic.twitter.com/dVjPJLTiRZ
— Ministry of Health (@MoHFW_INDIA) May 23, 2022