ఆరేళ్ల వయస్సులోనే..యంగెస్ట్ కంప్యూటర్ ప్రోగ్రామర్, గిన్నిస్ బుక్ రికార్డు

  • Published By: madhu ,Published On : November 11, 2020 / 02:59 PM IST
ఆరేళ్ల వయస్సులోనే..యంగెస్ట్ కంప్యూటర్ ప్రోగ్రామర్, గిన్నిస్ బుక్ రికార్డు

Updated On : November 11, 2020 / 4:33 PM IST

6-year-old Ahmedabad boy enters Guinness World Record : గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన ఓ బుడతడు ప్రపంచంలోనే అతి చిన్న వయసు కంప్యూటర్‌ ప్రోగ్రామర్‌గా గిన్నిస్‌ రికార్డుల్లోకి ఎక్కాడు. నగరంలోని ఉద్గమ్‌ స్కూల్‌లో రెండో తరగతి చదువుతున్న తల్సానియా.. ఆరేళ్ల వయసులోనే ఈ ఘనత సాధించాడు. తన బర్త్‌డేకు ఒక్క రోజు ముందు గిన్నిస్‌ ప్రపంచ రికార్డును సొంతం చేసుకున్నాడు. తల్సానియా గిన్నిస్‌ రికార్డ్‌ విషయాన్ని సాంకేతిక దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ కూడా ధృవీకరించింది.



తల్లిదండ్రులు పిల్లలను ప్రోత్సహిస్తే ఎలాంటి విజయాన్నైనా సునాయాసంగా సాధించగలరని తల్సానియా నిరుపించాడు. తల్సానియా తండ్రి సాఫ్ట్ వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్నాడు. తన కుమారుడు కోడింగ్ పట్ల ఆసక్తి చూపిస్తుండటంతో అతనికి బేసిక్ పైథాన్ ప్రోగ్రామింగ్‌ను నేర్పించాడు. తండ్రి ప్రోత్సాహంతో గిన్నిస్ వరల్డ్ రికార్డులో చోటు సాధించాడు ఈ బుడతడు.



ప్రస్తుతం రెండో తరగతి చదువుతున్న తల్సానియా ఇటీవలే మైక్రోసాఫ్ట్ సర్టిఫికేషన్ లాంగ్వేజ్‌ను క్లియర్‌ చేశాడు. ఈ ఘనత సాధించిన అతి పిన్న వయస్కుడైన కంప్యూటర్ ప్రోగ్రామర్‌గా నిలిచాడు. ప్రపంచంలో ఇప్పటివరకు ఈ ఫీట్‌ ఎవరూ సాధించలేదు.



https://10tv.in/man-covers-himself-with-over-6-lakh-bees-bags-record-video-creates-buzz/
తల్సానియా రెండేళ్ల వయసులోనే టాబ్లెట్‌ను ఉపయోగించటం ప్రారంభించాడు. విండోస్‌, IOSలతో పనిచేసే గ్యాడ్జెట్లను వాడటమే కాకుండా వివిధ కంప్యూటర్‌ పజిల్స్‌ను కూడా ఛేదించేవాడు. వీడియో గేమ్స్‌ ఆడుతూ ఉండగా తల్సానియాకు కొత్త వాటిని రూపొందించాలనే ఆలోచన వచ్చింది. ఇది గమనించిన బుడతడి తండ్రి.. ప్రోగ్రామింగ్‌లో ప్రాథమిక శిక్షణ ఇచ్చాడు. పైథాన్‌ ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజ్‌లో తల్సానియా గేమ్స్‌ కూడా స్వయంగా తయారుచేశాడు.