Medical Students Test Positive : రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నా..66మంది మెడికల్ విద్యార్ధులకు కరోనా

కర్ణాటకలోని ధార్వాడ్‌లోని 66 మంది SDM మెడికల్ కాలేజీ విద్యార్థులకు కరోనా పాజిటివ్ గా తేలినట్లు గురువారం(నవంబర్-25,2021)అధికారులు తెలిపారు. SDM కాలేజ్ ఆఫ్ మెడికల్ లో

Medical Students Test Positive : రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నా..66మంది మెడికల్ విద్యార్ధులకు కరోనా

Covid

Updated On : November 25, 2021 / 3:10 PM IST

Medical Students Test Positive: కర్ణాటకలోని ధార్వాడ్‌లోని 66 మంది SDM మెడికల్ కాలేజీ విద్యార్థులకు కరోనా పాజిటివ్ గా తేలినట్లు గురువారం(నవంబర్-25,2021)అధికారులు తెలిపారు.
SDM కాలేజ్ ఆఫ్ మెడికల్ లో ఇటీవల ఓ కార్యక్రమం జరిగిన తర్వాత ఆ కార్యక్రమంలో పాల్గొన్న మొత్తం 400 మంది విద్యార్ధులలో.. 300 మందిని విద్యార్థులు కోవిడ్ పరీక్షలు చేయించుకోగా 66మందికి పాజిటివ్ గా తేలింది. అయితే కోవిడ్ పాజిటివ్ గా తేలిన వీరందరూ ఇప్పటికే రెండు డోసుల కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారని అధికారులు తెలిపారు.

ఇక, జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి, డిప్యూటీ కమిషనర్‌ ఆదేశాల మేరకు కాలేజీలోని రెండు హాస్టళ్లను ముందుజాగ్రత్త చర్యగా సీల్‌ చేశారు. కోవిడ్ సోకిన విద్యార్థులను క్వారంటైన్ లో ఉంచామని, వారికి హాస్టల్‌లోనే ట్రీట్మెంట్ చేయిస్తామని ధార్వాడ్ డిప్యూటీ కమిషనర్ నితీష్ పాటిల్ తెలిపారు.

ఇక, మిగిలిన 100 మంది విద్యార్థులకు COVID-19 పరీక్షలు చేయించనున్నట్లు తెలిపారు. విద్యార్థులను క్వారంటైన్‌ చేసినట్లు తెలిపారు. హాస్టళ్ల నుంచి ఎవరూ బయటకు రావడానికి వీల్లేకుండా..విద్యార్థులకు వైద్యం, ఆహారం హాస్టల్ లోనే అందిస్తున్నామన్నారు.

ALSO READ Karnataka KGF : పాత ఇనుము వ్యాపారం చేస్తూ..వేల కోట్లు సంపాదించాడు, ఇప్పుడు ఎన్నికల బరిలో