Mine Collapse 7 Died : చత్తీస్ ఘడ్ లో ఘోర ప్రమాదం.. గని కూలి ఏడుగురు మృతి
చత్తీస్ ఘడ్ లో ఘోర ప్రమాదం జరిగింది. మాలగావ్ లో గని కూలి ఏడుగురు మృతి చెందారు. మరో 12 మందికి పైగా శిథిలాల్లో చిక్కుకున్నారు.

mine collapse
Mine Collapse 7 Died : చత్తీస్ ఘడ్ లో ఘోర ప్రమాదం జరిగింది. మాలగావ్ లో గని కూలి ఏడుగురు మృతి చెందారు. మరో 12 మందికి పైగా శిథిలాల్లో చిక్కుకున్నారు. మృతుల్లో ఒక పురుషుడు, ఆరుగురు మహిళలు ఉన్నారు. గనిలో తవ్వకాలు జరుగుతుండగా అకస్మాత్తుగా ఈ ఘటన చోటు చేసుకుంది.
Also Read : Coal Mine Collapse : కుప్పకూలిన బొగ్గు గని..14 మంది దుర్మరణం
సమచారం తెలుసుకున్న పోలీసులు, ఎన్ డీఆర్ఎఫ్ టీమ్ ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల్లో చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. గని కూలడంతో సమీప ప్రాంతంలోని రెండు గ్రామాల ప్రజలను అధికారులు అక్కడి నుంచి ఖాళీ చేయిస్తున్నారు.