School Hostel : బెడ్‌పై మూత్ర విసర్జన చేసిన బాలుడు.. చితకబాదిన ప్రిన్సిపల్!
8 ఏళ్ల బాలుడు బెడ్ పై మూత్రం పోశాడని ప్రిన్సిపాల్ చితకబాదాడు.. ఈ ఘటన బీహార్ లో చోటుచేసుకుంది. విషయం తెలిసిన బాలుడి కుటుంబ సభ్యులు పాఠశాలకు వచ్చి ప్రిన్సిపాల్ తో గొడవకు దిగారు.

School Hostel
School Hostel : 8 ఏళ్ల బాలుడు బెడ్‌పై మూత్రం పోశాడని ప్రిన్సిపల్ చితకబాదాడు.. ఈ ఘటన బీహార్‌లో చోటుచేసుకుంది. విషయం తెలిసిన బాలుడి కుటుంబ సభ్యులు పాఠశాలకు వచ్చి ప్రిన్సిపల్ తో గొడవకు దిగారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. షేక్ పురా జిల్లాలోని చేవారా పోలీస్ స్టేషన్ పరిధిలో తల్లిదండ్రులతో కలిసి 8 ఏళ్ల బాలుడు నివాసం ఉంటున్నారు. కరోనా నిబంధలు తొలగించి పాఠశాలలు ప్రారంభిచడంతో జముయ్ జిల్లా సికంద్రాలోని లార్డ్ జీసస్ స్కూల్లో బాలుడిని చేర్పించారు తల్లిదండ్రులు. అక్కడే హాస్టల్ లో ఉంటూ తరగతులకు హాజరయ్యేవాడు.
Read More : 3 Day Work Week: ఆ కంపెనీ ఉద్యోగులకు వారంలో మూడు రోజులే పని..
ఈ తరుణంలోనే శనివారం రాత్రి సమయంలో బాలుడు బెడ్ పై మూత్ర విసర్జన చేశాడు. అది తెలుసుకున్న ప్రిన్సిపల్ బాలుడిని చితకబాదాడు. ఆదివారం బాలుడిని చూసేందుకు వచ్చిన చుట్టాలు అతడి ఒంటిపై ఉన్న గాయాలను గమనించి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. దీంతో పాఠశాలకు వచ్చిన తల్లిదండ్రులు ప్రిన్సిపల్ తో గొడవకు దిగారు. ప్రిన్సిపల్ ని సస్పెండ్ చెయ్యాలంటూ కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు.
ఇక ఈ ఘటనపై మీడియాతో మాట్లాడిన ప్రిన్సిపాల్, శని, ఆదివారాల్లో తానసలు పాఠశాలలోనే లేనని తెలిపారు. బాలుడిపై తాను చేయిచేసుకోలేదని వివరించాడు. ఇక ఘటనపై బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.