Black Fungus : కరోనాను జయించిన 80ఏళ్ల వృద్ధుడు.. కానీ ఆ భయంతో ఆత్మహత్య
గుజరాత్ లోని అహ్మదాబాద్ లో విషాదం చోటు చేసుకుంది. బ్లాక్ ఫంగస్ భయం నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఆయన కరోనాను జయించాడు, కానీ బ్లాక్ ఫంగస్ సోకుతుందేమోనన్న భయంతో ఆత్మహత్య చేసుకున్నాడు.

80 Year Old Covid Survivor Suicide
80 Year Old Covid Survivor Suicide : ప్రస్తుతం కరోనా కారణంగా సంక్షోభ పరిస్థితులు నెలకొని ఉన్నాయి. అంతా ఆందోళనలో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఎలాంటి ఆరోగ్య సమస్య వచ్చినా డాక్టర్లను సంప్రదించాలని, అనవసర భయాలతో తీవ్ర నిర్ణయాలు తీసుకోవద్దని నిపుణులు పదే పదే కోరుతున్నారు. అయినప్పటికి కొందరు అనవసర భయాలతో ప్రాణాలు తీసుకుంటున్నారు. గుజరాత్ లోని అహ్మదాబాద్ లో విషాదం చోటు చేసుకుంది. బ్లాక్ ఫంగస్ భయం నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఆయన కరోనాను జయించాడు, కానీ బ్లాక్ ఫంగస్ సోకుతుందేమోనన్న భయంతో ఆత్మహత్య చేసుకున్నాడు.
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో 80ఏళ్ల వృద్ధుడు తన భార్యతో కలిసి అహ్మదాబాద్‌లోని పాల్దీ ప్రాంతంలోని అమన్ అపార్టుమెంట్‌లో నివాసం ఉంటున్నాడు. గురువారం (మే 27,2021) సాయంత్రం అపార్ట్‌మెంట్‌లోని టెర్రస్‌పైకి వెళ్లి పురుగుల మందు తాగాడు. అక్కడే పడిపోయాడు. గమనించిన కుటుంబసభ్యులు ఆయనను ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం(మే 29,2021) చనిపోయాడు.
కొంతకాలం క్రితం ఆ వృద్ధుడు కరోనా నుంచి కోలుకున్నాడు. ఇటీవల నోటిలో పుండులా ఏర్పడింది. దాంతో బ్లాక్‌ఫంగస్ సోకిందేమోననే భయాన్ని పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే తీవ్ర నిర్ణయం తీసుకున్నాడు. ఓ సూసైడ్ నోటు రాశాడు. పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కరోనా సోకిన వారికి, అందులోనూ షుగర్ పేషెంట్లకు బ్లాక్‌ఫంగస్ ముప్పు పొంచి ఉండటంతో తనకూ ఈ వ్యాధి వచ్చిందేమోనన్న భయంతో ప్రాణం తీసుకున్నాడు.
బ్లాక్ ఫంగస్‌కు చికిత్సతో పెద్దగా ఫలితం ఉండకపోవచ్చని భావించిన వృద్ధుడు ఆ బాధతోనే ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. బాధితుడి ఆర్థిక పరిస్థితి బాగానే ఉన్నా మానసికంగా ఆందోళనకు గురయ్యాడని చెప్పారు. కుటుంబ సభ్యుల స్టేట్‌మెంట్, అతడి సూసైడ్ నోట్ ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు.
కరోనా తీవ్రత కాస్త తగ్గుతోందని ఊపిరి పీల్చుకునే లోపే దేశంలో బ్లాక్ ఫంగస్ మహమ్మారి చాపకింద నీరులా వ్యాపిస్తోంది. కరోనా నుంచి కోలుకున్న వారిని అటాక్ చేస్తోంది. వారి ప్రాణాలు తీస్తోంది.