లిమ్కా రికార్డ్ బద్దలైంది : ఒక్క మొక్కకు 865 పూలు..!

  • Published By: veegamteam ,Published On : September 18, 2019 / 09:36 AM IST
లిమ్కా రికార్డ్ బద్దలైంది : ఒక్క మొక్కకు 865 పూలు..!

Updated On : September 18, 2019 / 9:36 AM IST

ఆ మొక్కను చూస్తే..అది మొక్కా పూల మార్కెట్టా అనిపించేలా విరగబూసింది. బంతి పువ్వుల్ని చూస్తే మనస్సుకు ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. ముద్దబంతి,రేక బంతి,ఊక బంతి, కృష్ణ బంతి ఇలా ఎన్నో రకాలు..మరెన్నో రంగులతో బంతి మొక్క అలరిస్తుంది. అటువంటి బంతి మొక్కతో ఓ సైంటిస్ట్ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులో చోటు సాధించారు.

ఒక్క బంతి మొక్కకు 100,200 కాదు ఏకంగా 865 పూలు పూయించిన హిమాచల్‌ప్రదేశ్‌లోని చంబాఘాట్‌కు చెందిన కుంభ్ అనుసంధాన్ శాస్త్రవేత్త డాక్టర్ బ్రజ్ లాల్ అత్రీ పేరు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌ సాధించారు. 

డాక్టర్ బ్రజ్ లాల్ అత్రీ నాలుగేళ్ల కృషికి లిమ్కా రికార్డుతో ఘనమై ఫలితం దక్కింది. లిమ్కా బుక్ ఇచ్చిన రికార్డ్  సర్టిఫికెట్ అందుకున్నారు. డాక్టర్ అత్రీ 2015లో బంతి మొక్కలకు భారీ సంఖ్యలో పూలు పూయించేందుకు కృషి చేశారు. ఎన్నో ప్రయోగాలు చేశారు. చివరకు విజయం సాధించారు.

ఉత్తరాఖండ్ ముక్తేశ్వర్ నైనితాల్ లో   తాను పెంచిన మొక్కకు పూసి బంతి మొక్కకు సంబంధించిన ఫోటోను..వీడియోను లిమ్కా బుక్ ప్రతినిధులకు పంపించారు. తరువాత లిమ్కా బుక్ ప్రతినిథులు మొక్కను పరిశీలించి..గతంలో ఇటువంటి రికార్డు లేదని ఒక్క బంతి మొక్కకు 865 పూలు పూయటం రికార్డ్ అయిన నిర్ణయించారు. అనంతరం డాక్టర్ అత్రికి రికార్డు సర్టిఫికెట్ ను ఇచ్చారు.