872 మంది రైల్యే ఉద్యోగులకు కరోనా పాజిటివ్ : 86మంది మృతి

  • Published By: nagamani ,Published On : July 7, 2020 / 04:44 PM IST
872 మంది రైల్యే ఉద్యోగులకు కరోనా పాజిటివ్ : 86మంది మృతి

Updated On : July 7, 2020 / 5:51 PM IST

రోజురోజుకు దేశవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసులు భయాందోళనలకు కలిగిస్తున్నాయి. కరోనా యోధులుగా పోరాడుతున్న డాక్టర్లు, వైద్య సిబ్బంది,పోలీసులు ఇలా ఎవ్వరినీ కరోనా వదలటంలేదు. ఈక్రమంలో రైల్వే ఉద్యోగులకు కరోనా సోకింది. సెంట్రల్‌ రైల్వే, వెస్ట్రన్‌ రైల్వేకు చెందిన సుమారు 872 మంది ఉద్యోగులు..వారి కుటుంబ సభ్యులు, రిటైర్డ్‌ ఉద్యోగులకు కరోనా వైరస్ సోకింది.

ఈ విషయాన్ని రైల్వే అధికారులు వెల్లడించారు. కరోనా మహమ్మారి వల్ల ఇప్పటి వరకు 86 మంది ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు.వారిలో ఎక్కువగా సెంట్రల్ రైల్వేలో 559 మందికి కరోనా సోకగా, వెస్ట్రన్ రైల్వేలో 313 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. మృతిచెందిన 86 మందిలో 22 మంది రైల్వే ఉద్యోగులు కాగా.. మిగిలినవారు వారి కుటుంబ సభ్యులు, రిటైర్డ్ సిబ్బంది ఉన్నారని తెలిపారు.

కరోనా సోకినవారందరినీ వెస్ట్రన్ రైల్వేకు చెందిన జగ్జీవన్ రామ్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్సనందిస్తున్నారు. కరోనా రోగుల చికిత్స కోసం ఏప్రిల్‌లో ప్రత్యేకంగా ఆసుపత్రిని కేటాయించారు. జూన్ 15 నుండి స్థానిక రైలు సర్వీసులు తిరిగి ప్రారంభమైనప్పటి నుండి, రైల్వే ఉద్యోగులలో COVID-19 కేసులు పెరుగుతున్నాయని కొన్ని రైల్వే యూనియన్లు పేర్కొంటున్నాయి.

రైల్వే సిబ్బంది..ప్రయాణీకులలో COVID-19 వ్యాప్తి చెందకుండా తగినజాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సెంట్రల్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ శివాజీ సుతార్ తెలిపారు. రైల్వే ఉద్యోగులు..ప్రయాణీకుల భద్రత కోసం..సామాజిక దూరాన్ని పాటించేలా అన్ని చర్యలు తీసుకున్నామని మాస్క్ లు..శానిటైజర్లతో పాటు అన్ని భద్రతా పరికరాలను అందిస్తున్నామని ఆయన తెలిపారు.

Read Here>>కరోనాతో గోవా మాజీ ఆరోగ్యశాఖ మంత్రి కన్నుమూత