Climate Risk Places : భారత దేశంలో తొమ్మిది రాష్ట్రాల్లో పర్యావరణానికి హాని.. సీడీఎస్ నివేదిక ఏం చెప్పిదంటే..
సీడీఎస్ నివేదిక ప్రకారం.. చైనాలో 26 రాష్ట్రాలు, అమెరికాలో ఐదు ప్రావిన్సులు, భారత్ దేశంలో తొమ్మిది రాష్ట్రాలు అత్యంత పర్యావరణ హానికారక రాష్ట్రాలుగా ఉన్నాయి. ఈ జాబితాను ఎనిమిది వాతావరణ మార్పుల ఆధారంగా రూపొందించారు.

Climate Risk Places
Climate Risk Places : ప్రపంచ వ్యాప్తంగా పర్యావరణానికి అత్యంత హాని కలిగించే ప్రాంతాల జాబితాను సీడీఎస్ నివేదిక వెల్లడించింది. 2050లో పర్యావరణానికి హాని కలిగించే 2,500కుపైగా రాష్ట్రాలు, ప్రావిన్సుల్లోని వాతావరణ మార్పులను క్రాస్ డిపెండెన్సీ ఇనిషియేటివ్ (ఎక్స్‌డీఐ) గణించింది. వరదలు, అడవుల్లో మంటలు తదితరాలను పరిగణోకి తీసుకొని పర్యావరణ హానికారకాల ప్రాంతాల వివరాలను ఆ సంస్థ వెల్లడించింది. అయితే, ఈ జాబితాలో చైనా, అమెరికా, భారత్ నుంచే 80శాతం రాష్ట్రాలు ఉండటం గమనార్హం. వీటిల్లో మొదటి రెండు ప్రావిన్సులు చైనాలోని జియాంగ్సు, షాన్ డాంగ్‌గా నివేదిక పేర్కొంది.
సీడీఎస్ నివేదిక ప్రకారం.. చైనాలో 26 రాష్ట్రాలు, అమెరికాలో ఐదు ప్రావిన్సులు, భారత్ దేశంలో తొమ్మిది రాష్ట్రాలు అత్యంత పర్యావరణ హానికారక రాష్ట్రాలుగా ఉన్నాయి. ఈ జాబితాను ఎనిమిది వాతావరణ మార్పుల ఆధారంగా రూపొందించారు. అమెరికాలోని ఐదు ప్రావిన్సుల్లో మూడు ప్రావిన్సులైన ప్లోరిడా, టెక్సాస్, కాలిఫోర్నియాల్లో ఎక్కువ పర్యావరణ ప్రభావిత ప్రాంతాలుగా ఉన్నాయి.
Climate Change: భూమిపైనే కాదు.. మార్స్‌పై కూడా వాతావరణ మార్పుల ప్రభావం
ప్రపంచ వ్యాప్తంగా పర్యావరణ హానికర 50 రాష్ట్రాల్లో భారత్ నుంచి తొమ్మిది రాష్ట్రాలు ఉన్నాయి. వీటిలో బీహార్ 22వ స్థానంలో ఉండగా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రం 25వ స్థానంలో ఉంది. అస్సాం (28), రాజస్థాన్ (32), తమిళనాడు (48), పంజాబ్ (50), కేరళ రాష్ట్రాలు ఉన్నాయి. భారతదేశంలోని అస్సాం రాష్ట్రంలో 1990తో పోల్చితే 2050 నాటికి పర్యావరణాన్ని దెబ్బతీసే పరిస్థితులు 330 శాతానికిపైగా పెరగనున్నాయని తాజా నివేదిక పేర్కొంది.