Climate Change: భూమిపైనే కాదు.. మార్స్‌పై కూడా వాతావరణ మార్పుల ప్రభావం

వాతావరణ మార్పుల ప్రతికూల ప్రభావం భూమిపైనే కాదు.. మార్స్ పై కూడా ఎప్పుడో పడింది. కొన్ని లక్షల సంవత్సరాల క్రితం అంగారక గ్రహంపై సూక్ష్మజీవులు ఉండేవని, వాతావరణ మార్పుల కారణంగా అవి అంతరించిపోయాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. అప్పట్లో సూక్ష్మ జీవరాశి మనుగడకు అనుకూల వాతావరణం అంగారక గ్రహంపై ఉండేదని చెప్పారు.

Climate Change: భూమిపైనే కాదు.. మార్స్‌పై కూడా వాతావరణ మార్పుల ప్రభావం

Climate Change: అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ ‘నాసా’కు చెందిన ‘పర్సవరెన్స్‌ రోవర్‌’ అంగాకర గ్రహం (మార్స్) పై జీవాన్వేషణను కొనసాగిస్తోంది. ఇప్పటికే అక్కడి నుంచి అనేక శాంపిళ్లను పంపించిన ‘పర్సవరెన్స్‌ రోవర్‌’ పరిశోధనలకు ఎంతగానో తోడ్పడింది. ‘పర్సవరెన్స్‌ రోవర్‌’ పంపిన శాంపిళ్ల ఆధారంగా తాజాగా శాస్త్రవేత్తలు మరో కొత్త విషయాన్ని కనుగొన్నారు. వాతావరణ మార్పుల వల్ల భూమికి తీవ్ర విపత్తు తప్పదని పరిశోధకులు హెచ్చరిస్తుండడం మనం వింటూనే ఉంటాం. అయితే, వాతావరణ మార్పుల ప్రతికూల ప్రభావం భూమిపైనే కాదు.. మార్స్ పై కూడా ఎప్పుడో పడింది. కొన్ని లక్షల సంవత్సరాల క్రితం అంగారక గ్రహంపై సూక్ష్మజీవులు ఉండేవని, వాతావరణ మార్పుల కారణంగా అవి అంతరించిపోయాయని శాస్త్రవేత్తలు గుర్తించారు.

అప్పట్లో సూక్ష్మ జీవరాశి మనుగడకు అనుకూల వాతావరణం అంగారక గ్రహంపై ఉండేదని చెప్పారు. అయితే, ఆ సూక్ష్మజీవుల వల్ల మార్స్ కు అంతగా ఉపయోగం ఏమీ లేదని తెలిపారు. ఆ సూక్ష్మజీవుల కారణంగానే మార్స్ పై కార్బన్ డై ఆక్సైడ్ పెరగడం వంటి వాతావరణ మార్పులు చోటుచేసుకున్నాయని వివరించారు. మంచు యుగం వంటి పరిస్థితులు ఏర్పడి అవి అంతరించిపోయాయని చెప్పారు.

వాతావరణ మార్పు ప్రభావం మార్స్ పై కూడా పడినట్లు తొలిసారి గుర్తించామని అన్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను నేచర్ ఆస్టానమీ జర్నల్ లో ప్రచురించారు. అంగారక గ్రహంపై సూక్ష్మజీవులు ఉండడానికి ప్రత్యేక వాతావరణ పరిస్థితులు ఉండేవని చెప్పారు. పలు పద్ధతుల ద్వారా శాస్త్రవేత్తలు ఈ విషయాలను తేల్చారు. ప్రస్తుతం ఉన్న దానికంటే అప్పట్లో అంగారక గ్రహంపై నీళ్లు, జీవుల మనుగడకు అనుకూలమైన వాతావరణం అధికంగా ఉండేదని తేల్చినట్లు తెలిపారు.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..