CJI : చారిత్రక ఘట్టం ఒక్కరోజే 9 మంది న్యాయమూర్తుల బాధ్యతలు

2021, ఆగస్టు 31వ తేదీ మంగళవారం తొమ్మిది మంది సుప్రీం కోర్టు న్యాయమూర్తులుగా బాధ్యతలు తీసుకోనున్నారు.

CJI : చారిత్రక ఘట్టం ఒక్కరోజే 9 మంది న్యాయమూర్తుల బాధ్యతలు

Cji

Updated On : August 31, 2021 / 7:22 AM IST

9 New Top Court Judges : దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో అపూర్వ చారిత్రక ఘట్టం ఆవిష్కృతం కానుంది. 2021, ఆగస్టు 31వ తేదీ మంగళవారం తొమ్మిది మంది సుప్రీం కోర్టు న్యాయమూర్తులుగా బాధ్యతలు తీసుకోనున్నారు. ఉదయం పదిన్నర గంటలకు ప్రమాణ స్వీకారం చేయిస్తారు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ. కొత్తగా బాధ్యతలు తీసుకుంటున్న తొమ్మిది మందిలో.. ముగ్గురు మహిళా న్యాయమూర్తులున్నారు.

Read More : MPs, MLAs : ఎంపీలు, ఎమ్మెల్యేలపై పదేళ్లుగా పెండింగ్‌లో క్రిమినల్ కేసులు.. సుప్రీంకోర్టుకు అమికస్‌ క్యూరీ రిపోర్ట్

న్యాయమూర్తుల ప్రమాణస్వీకారం సుప్రీంకోర్టు అదనపు భవన ఆవరణంలోని ఆడిటోరియంలో జరనుంది. సాధారణంగా న్యాయమూర్తుల ప్రమాణస్వీకారం సీజేఐ (CJI) ప్రత్యేక కార్యాలయంలోనే జరుగుతుంది. ఇందుకు భిన్నంగా కోవిడ్ కట్టుదిట్టమైన నిబంధనలతో ఈసారి ఆడిటోరియంలో నిర్వహించనున్నాయి సుప్రీంకోర్టు వర్గాలు. ఇంతకు ముందెన్నడు కూడా.. సుప్రీంకోర్టు చరిత్రలో ఇంతమంది న్యాయమూర్తులు ఒకేసారి ప్రమాణస్వీకారం చేయలేదు.

Read More : NDA exam: ఎన్డీఏ పరీక్షలు రాయనున్న మహిళలు.. కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశాలు

మంగళవారం ప్రమాణస్వీకారం చేయనున్న తొమ్మిది మంది జడ్జిలతో సుప్రీంకోర్టులో మొత్తం న్యాయమూర్తుల సంఖ్య సీజేఐతో కలిపి.. 33కు చేరుతుంది. సుప్రీంకోర్టుకు ఉండాల్సిన న్యాయమూర్తుల సంఖ్య 34. ఒకేసారి తొమ్మిది మంది జడ్జిల ప్రమాణం, వేదిక మార్పు ఈ రెండూ సరికొత్త అంశాలని చెప్పుకొచ్చింది సుప్రీంకోర్టు ప్రజా సంబంధాల కార్యాలయం. మొదటిసారిగా కార్యక్రమాన్ని డీడీ న్యూస్, దూరదర్శన్ ఇండియాలో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ఇది కూడా సరికొత్త అంశమే.

Read More : Supreme Court Comments : జార్ఖండ్ జడ్జి హత్య కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

కర్ణాటక హైకోర్టు సీజే జస్టిస్‌ ఏఎస్‌ ఓకా, గుజరాత్‌ హైకోర్టు సీజే జస్టిస్‌ విక్రమ్‌నాథ్, సిక్కిం హైకోర్టు సీజే జస్టిస్‌ జేకే మహేశ్వరి, కేరళ హైకోర్టు జడ్జి జస్టిస్‌ సీటీ రవికుమార్, మద్రాస్‌ హైకోర్టు జడ్జి జస్టిస్‌ ఎంఎం సుందరేశ్, తెలంగాణ హైకోర్టు సీజే జస్టిస్‌ హిమా కోహ్లి, కర్ణాటక హైకోర్టు జడ్జి జస్టిస్‌ బీవీ నాగరత్న, గుజరాత్‌ హైకోర్టు జడ్జి బేలా త్రివేది, బార్‌ నుంచి న్యాయవాది పీఎస్‌ నరసింహలను కొలిజియం సిఫార్సు చేసింది.