Delhi Customs : ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో రూ. కోటి విలువైన ఐఫోన్లు సీజ్

గార్మెంట్స్(వస్త్రాలు) పేరుతో దేశంలోకి తరలిస్తున్న కోటి రూపాయల విలువైన 90 ఐఫోన్లను ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో కస్టమ్స్​ అధికారులు జప్తు చేశారు.

Delhi Customs : ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో రూ. కోటి విలువైన ఐఫోన్లు సీజ్

Updated On : July 9, 2021 / 4:35 PM IST

Iphones Sezied At Delhi Airport: గార్మెంట్స్(వస్త్రాలు) పేరుతో దేశంలోకి తరలిస్తున్న కోటి రూపాయల విలువైన 90 ఐఫోన్లను ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో కస్టమ్స్​ అధికారులు జప్తు చేశారు.

శుక్రవారం గార్మెంట్స్ గా పేర్కొంటూ దుబాయి నుంచి మూడు పార్సిళ్లు ఢిల్లీ ఎయిర్ పోర్ట్ కి వచ్చాయని..అయితే అధికారులు అప్రమత్తంగా ఉండి ఎక్స్‌రే విభాగంలో స్కానింగ్‌ చేయగా అందులో 90 ఐఫోన్ 12 ప్రో మోడల్‌ ఫోన్లు ఉన్నట్లు గుర్తించి సీజ్ చేశామని ఎయిర్‌ కార్గో కస్టమ్స్‌ (ఏసీసీ) ఎక్స్‌పోర్ట్‌ కమిషనరేట్‌, ఢిల్లీ కస్టమ్స్ పేర్కొంది. వీటి విలువ కోటి రూపాయల వరకు ఉంటుందని తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.