Heart Attack Deaths: చలి చంపేస్తుంది.. అక్కడ వారం రోజుల్లో 98మంది మృతి.. అందరికీ ఒకటే సమస్య..
తీవ్రమైన చలి కారణంగా కాన్పూర్‍లో శనివారం ఒక్కరోజే 14 మంది మరణించారని, మూడు వారాల్లో 98 మంది మరణించినట్లు ఎల్పీఎస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ అండ్ కార్డియాక్ సర్జరీ గణాంకాలను విడుదల చేసింది. అయితే, మరణించిన వారందరికి గుండె, బ్రెయిన్ అటాక్ కారణంగా వైద్యులు తేల్చారు.

Heart Attack Deaths
Heart Attack Deaths: ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో విషాదం నెలకొంది. ఈ ప్రాంతంలో వరుస మరణాలను స్థానికులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. వారం రోజుల్లో ఏకంగా 98 మంది మరణించారు. చాలా మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇంతకీ అక్కడేమవుతుంది? ఏదైనా వ్యాధి సోకడం కారణంగా వీరు చనిపోతున్నారా? అంటే అదేమీకాదు. చలికాలంలో గుండెపోటు, బ్రెయిన్ ఎటాక్ కారణంగా చనిపోతున్నవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది.
Heart Attack In Gym : షాకింగ్ వీడియో.. జిమ్ చేస్తుండగా గుండెపోటుతో మృతి
ఉత్తర భారతం అంతటా చలి విజృంభిస్తుంది. దీంతో కార్డియాలజీకి రోగులరాక పెరుగుతోంది. చలిలో ఒక్కసారిగా రక్తపోటు పెరగడం వల్ల రక్తనాళాల్లో రక్తం గడ్డలు పేరుకుపోయి గుండెపోటు, బ్రెయిన్ ఎటాక్ వస్తాయని వైద్యులు పేర్కొంటున్నారు. చలికి గుండె, మనసు రెంటినీ వణికిస్తోంది. ముఖ్యంగా 60ఏళ్లు పైబడిన వారు చలి తీవ్రతకు బయటికి వెళ్లవద్దని, మిగిలిన వయస్సులవారుసైతం అవసరం అయితేతప్ప చలితీవ్రత ఎక్కువగా ఉంటే బయటకు వెళ్లకపోవటం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.
తీవ్రమైన చలి కారణంగా కాన్పూర్‍లో శనివారం ఒక్కరోజే 14 మంది మరణించారని, మూడు వారాల్లో 98 మంది మరణించినట్లు ఎల్పీఎస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ అండ్ కార్డియాక్ సర్జరీ గణాంకాలను విడుదల చేసింది. అయితే, మరణించిన వారందరికి గుండె, బ్రెయిన్ అటాక్ కారణంగా వైద్యులు తేల్చారు. 98మంది మృతుల్లో 44 మంది ఆసుపత్రిలో మరణించగా, 54 మంది రోగులు చికిత్స కు ముందు మరణించారు.