Electric Vehicles To Employees : ఉద్యోగులకు దీపావళి గిఫ్ట్ గా ఎలక్ట్రిక్ స్కూటర్లు

ఉద్యోగులను సంతోషంగా ఉంచడంలో సూరత్ వ్యాపారుల తీరే వేరు.

Electric Vehicles To Employees : ఉద్యోగులకు దీపావళి గిఫ్ట్ గా ఎలక్ట్రిక్ స్కూటర్లు

Surat (1)

Updated On : November 4, 2021 / 9:39 PM IST

Surat Company ఉద్యోగులను సంతోషంగా ఉంచడంలో సూరత్ వ్యాపారుల తీరే వేరు. పండుగల సందర్భంలో తమ  సిబ్బందికి ఆశ్చర్యపరిచే బహుమతులివ్వడంలో సూరత్ కంపెనీల యజమానులకు ఓ ప్రత్యేకమైన పేరుంది.

తాజాగా సూరత్ కు చెందిన అలయన్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ యజమాని తమ సిబ్బందికి దీపావళి గిఫ్ట్ గా ఎలక్ట్రిక్ స్కూటర్లు బహుమతిగా ఇచ్చారు. పెట్రోల్ ధరల పెరుగుదల,ఇతర కొన్ని కారణాలతో తమ సిబ్బందికి ఎలక్ట్రిక్ స్కూటర్లు గిఫ్ట్ గా ఇచ్చినట్లు కంపెనీ డైరెక్టర్ సుభాష్ దావర్ తెలిపారు.


ALSO READ AQI In Delhi : ఢిల్లీలో తీవ్రస్థాయికి వాయుకాలుష్యం!