AQI In Delhi : ఢిల్లీలో తీవ్రస్థాయికి వాయుకాలుష్యం!
దేశ రాజధానిలో దీపావళి బాణాసంచా పేలుళ్లతో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. జనవరి 1, 2022 వరకు దేశ రాజధానిలో బాణసంచా కాల్చడంపై నిషేధం ఉన్నప్పటికీ

Delhi
AQI దేశ రాజధానిలో దీపావళి బాణాసంచా పేలుళ్లతో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. జనవరి 1, 2022 వరకు దేశ రాజధానిలో బాణసంచా కాల్చడంపై నిషేధం ఉన్నప్పటికీ.. దక్షిణ ఢిల్లీలోని లజ్‌పత్ నగర్, ఉత్తర ఢిల్లీలోని బురారీ, పశ్చిమ ఢిల్లీలోని పశ్చిమ్ విహార్ మరియు తూర్పు ఢిల్లీలోని షాహదారా నివాసితులు రాత్రి 7 గంటలకే పటాకులు పేల్చారు.
ప్రభుత్వం విధించిన నిషేధాన్ని పట్టించుకోకుండా ప్రజలు బాణాసంచా పేల్చడం వల్ల ఢిల్లీ అంతా పొగతో కప్పబడినట్లయిపోయింది. అంతకంతకు పెరుగుతోన్న ఎయిర్ పొల్యూషన్ నగరవాసులను ఆందోళన కలిగిస్తోంది. ఇవాళ సాయంత్రం ఢిల్లీలోని అనేక ప్రాంతాల్లో,ఢిల్లీ శివార్ల ప్రాంతాల్లోని ప్రజలు.. గొంతు దురద మరియు కళ్లల్లో నుంచి నీళ్లు వస్తున్నట్లు తెలిపారు.
ఢిల్లీ మరియు నేషనల్ క్యాపిటల్ రీజియన్ (NCR)లోని అనేక ప్రాంతాల్లో ఇవాళ సాయంత్రం గాలి నాణ్యత సూచిక 382కి క్షీణించి “చాలా పేలవమైన స్థాయికి” చేరుకుందని, అర్ధరాత్రి నాటికి ‘తీవ్రంగా’ మారవచ్చని అధికారులు తెలిపారు. శుక్రవారం ఉదయం నాటికి ఢిల్లీలో గాలి నాణ్యత తీవ్రమైన కేటగిరీకి చేరుకునే అవకాశముందని తెలిపారు.
గాలి నాణ్యత…0- 50 మధ్య ఉంటే ‘మంచిదిగా’, 51-100 ‘సంతృప్తికరమైనదిగా’, 101- 200 ‘ఓ మోస్తరుగా ఉన్నదిగా’, 201- 300 ‘పూర్ గా’, 301- 400 ‘చాలా పేలవమైనదిగా’ మరియు 401-500 మధ్య ఉంటే ‘తీవ్రమైనది’గా పరిగణిస్తారు.
ALSO READ Covid In Russia And Germany : జర్మనీ,రష్యాపై కోవిడ్ పంజా..రికార్డు స్థాయిలో కేసులు,మరణాలు