People Breathe Polluting Gases : భారత్‌లో 99 శాతం మంది ప్రజలు అత్యంత కాలుష్యపూరిత వాయువులను పీలుస్తున్నారట!

భారత్‌లో ప్రజలు కాలుష్య వాతావరణంలో జీవిస్తున్నారని ఓ అధ్యయనంలో తేలింది. 99 శాతం మంది ప్రజలు నిత్యం అత్యంత కాలుష్యపూరిత వాయువులను పీలుస్తున్నారట. డబ్ల్యూహెచ్‌వో నిర్దేశించిన అతిసూక్ష్మ ధూళి కణ కాలుష్యం పీఎం 2.5కి మించి ఐదు రెట్ల ఎక్కువ కాలుష్యం ఉందని...గ్రీన్‌పీస్‌ ఇండియా రిపోర్ట్‌లో తేలింది.

People Breathe Polluting Gases : భారత్‌లో 99 శాతం మంది ప్రజలు అత్యంత కాలుష్యపూరిత వాయువులను పీలుస్తున్నారట!

People Breathe Polluting Gases

Updated On : September 3, 2022 / 8:49 PM IST

People Breathe Polluting Gases : భారత్‌లో ప్రజలు కాలుష్య వాతావరణంలో జీవిస్తున్నారని ఓ అధ్యయనంలో తేలింది. 99 శాతం మంది ప్రజలు నిత్యం అత్యంత కాలుష్యపూరిత వాయువులను పీలుస్తున్నారట. డబ్ల్యూహెచ్‌వో నిర్దేశించిన అతిసూక్ష్మ ధూళి కణ కాలుష్యం పీఎం 2.5కి మించి ఐదు రెట్ల ఎక్కువ కాలుష్యం ఉందని…గ్రీన్‌పీస్‌ ఇండియా రిపోర్ట్‌లో తేలింది. ఒకే ఆకాశం కింద విభిన్న వాయువుల పేరిట చేసిన అధ్యయనంలో కాలుష్య వివరాలను పొందుపరిచారు.

దేశవ్యాప్తంగా 62 శాతం మంది గర్భిణిలు అత్యంత కాలుష్య పూరిత ప్రాంతాల్లో నివసిస్తున్నారని గ్రీన్ పీస్‌ అధ్యయనంలో తేలింది. అత్యంత కాలుష్యనగరం ఢిల్లీయేనని స్పష్టం చేసింది. నాణ్యత లేని గాలి పీల్చడంతో.. వృద్ధులు, శిశువులు, గర్భవతులు ఎక్కువగా అనారోగ్యం భారినపడుతున్నారని నివేదికలో ప్రస్తావించారు.

UN Reportలో సంచలన విషయాలు.. మారుతున్న వాతావరణం.. మానవాళికి రెడ్ అలర్ట్

అతి సూక్ష్మ ధూళికణాలు శరీరం లోపలికి చొచ్చుకుపోయి..శ్వాసకోశ సమస్యలు, గుండెజబ్బుల భారినపడుతున్నారు. రోగ నిరోధకశక్తిని కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా వాయు నాణ్యత పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయాలని కేంద్రానికి గ్రీన్‌పీస్‌ ఇండియా సంస్థ విజ్ఞప్తి చేసింది.