Woman Molested : ఉత్తరప్రదేశ్‌లో దారుణం.. మహిళపై అత్యాచారం చేసి దారుణ హత్య

సూరజ్ కుమార్ సోన్కర్ అనే వ్యక్తి ఉద్యోగం కోసం ఓ మహిళకు డబ్బులు ఇచ్చాడు. కానీ, సోన్కర్ కు ఉద్యోగం రాలేదు. ఆమె తన మాట నిలబెట్టుకోలేకపోయారు.

Woman Molested : ఉత్తరప్రదేశ్‌లో దారుణం.. మహిళపై అత్యాచారం చేసి దారుణ హత్య

woman killed

Woman Molested and Killed : దేశంలో నిర్భయ లాంటి ఎన్ని చట్టాలొచ్చినా మహిళలపై అత్యాచారాలు, హత్యలకు అడ్డుకట్ట పడటం లేదు. అనునిత్యం దేశంలో ఏదో ఒక మూలన మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనేవున్నాయి. తాజాగా మరో ఘటన చోటు చేసుకుంది. మహిళపై అత్యాచారం చేసి అత్యంత కిరాతంగా హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మహిళపై అత్యాచారం చేసి, ఆమె ముఖాన్ని సిగరెట్లతో కాల్చి గొడ్డలితో దారుణంగా నరికి చంపాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని సుల్తాన్ పూర్ జిల్లాలో చోటు చేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూరజ్ కుమార్ సోన్కర్ అనే వ్యక్తి ఉద్యోగం కోసం ఓ మహిళకు డబ్బులు ఇచ్చాడు. కానీ, సోన్కర్ కు ఉద్యోగం రాలేదు. ఆమె తన మాట నిలబెట్టుకోలేకపోయారు. దీంతో తన డబ్బులు వెంటనే తిరిగి ఇచ్చేయాలని సోన్కర్ సదరు మహిళను డిమాండ్ చేయగా కొంత సమయం ఇవ్వాలని ఆమె కోరారు. అందుకు అంగీకరించని సోన్కర్ డిసెంబర్ 3న ఆమెపై అత్యాచారం చేశాడు.

Madhya Pradeshl : కదులుతున్న కారులో మైనర్ బాలికపై అత్యాచారం

ఆమె ముఖాన్ని సిగరెట్లతో కాల్చాడు. అనంతరం గొడ్డలితో మహిళను నరికి చంపాడు. సూరజ్ కుమార్ సోన్కర్ ను పోలీసులు అరెస్టు చేశారు. మృతదేహాన్ని తీసుకొచ్చి సుల్తాన్ పూర్ లోని ఓ రోడ్డుపై పడేశాడని తెలిపారు. మహిళను హత్య చేయడానికి వాడిన ఈ-రిక్షా, మొబైల్ ఫోన్, గొడ్డలిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్నపోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.