Madhya Pradeshl : కదులుతున్న కారులో మైనర్ బాలికపై అత్యాచారం

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మరో దారుణం జరిగింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని దిండోరి పట్టణంలో కదులుతున్న కారులో మైనర్ బాలికపై అత్యాచారం చేశారు.దిండోరిలో బిర్సా ముండా జయంతిని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళుతున్న మైనర్ బాలికపై నలుగురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు....

Madhya Pradeshl : కదులుతున్న కారులో మైనర్ బాలికపై అత్యాచారం

arrest

Minor girl : మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మరో దారుణం జరిగింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని దిండోరి పట్టణంలో కదులుతున్న కారులో మైనర్ బాలికపై అత్యాచారం చేశారు.దిండోరిలో బిర్సా ముండా జయంతిని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళుతున్న మైనర్ బాలికపై నలుగురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. బిర్సా ముండా జయంతిని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరయ్యేందుకు మైనర్ బాలిక తన సోదరితో కలిసి వెళుతోంది.

ALSO READ : Telangana Assembly Election 2023 : తెలంగాణలో చోటామోటా నేతల కొనుగోలుకు అభ్యర్థుల వ్యూహాలు

కార్యక్రమానికి బాలిక వస్తుండగా ఆమె గ్రామానికి చెందిన నలుగురు నిందితులు తమ కారును ఆపి వారికి లిఫ్ట్ ఇచ్చారు. బాలిక కారులో కూర్చున్న వెంటనే, నిందితులు అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. బాలిక ఏడుపు వినిపించకుండా కారులోపల బిగ్గరగా సంగీతాన్ని ప్లే చేశారు. ఈ ఘటన అనంతరం బాలిక జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలిపింది. ఈ ఘటనపై ఫిర్యాదు చేసేందుకు అదే రోజు స్థానిక పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించినా పోలీసులు ఫిర్యాదును స్వీకరించలేదు.

ALSO READ : Mysterious Pneumonia : చైనాలో మిస్టరీగా మారిన మరో మహమ్మారి న్యుమోనియా.. ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక

అనంతరం నవంబర్ 18న డిండోరి జిల్లా కేంద్రానికి వెళ్లి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయగా వారిపై కేసు నమోదు చేశారు. బాలికపై అత్యాచార ఘటనపై పోక్సో, ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని ఏఎస్పీ మార్కం చెప్పారు. నిందితుల్లో ఒకరిని పోలీసులు అరెస్టు చేసినట్లు ఏఎస్పీ తెలిపారు. ఇది సామూహిక అత్యాచారమా అని అడగ్గా ఈ కోణంలో దర్యాప్తు చేస్తున్నామని ఖచ్చితమైన వివరాలు వస్తాయని ఏఎస్పీ మార్కం పేర్కొన్నారు. కేసు నమోదు చేయని స్థానిక పోలీసులపై చర్యలు తీసుకుంటామని ఏఎస్పీ వివరించారు.