Arvind Kejriwal : ఇండియా కూటమికి షాకిచ్చిన అరవింద్ కేజ్రీవాల్.. ఢిల్లీలో ఒంటరిగానే పోటీచేస్తామని వెల్లడి
ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం మీడియాతో మాట్లాడారు. వచ్చే ఏడాది ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో

Arvind Kejriwal
Arvind Kejriwal : దేశ రాజధాని ఢిల్లీలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధికారంలో ఉంది. ఆ ఎన్నికల్లో ఇండియా కూటమితో ఆప్ పోటీ చేస్తుందని అందరూ భావిస్తున్న వేళ ఆ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ షాకింగ్ న్యూస్ చెప్పారు. ఢిల్లీలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమితో కలిసి పోటీ చేసే ప్రసక్తే లేదని తేల్చిచెప్పాడు. తాము ఒంటరిగా పోటీ చేస్తామని, అన్ని నియోజకవర్గాల్లో తమ పార్టీ అభ్యర్థులే బరిలో ఉంటారని స్పష్టం చేశారు.
Also Read: Nara Lokesh: ‘ఈ అన్నకి ఒక్క మెసేజ్ చేయాలనిపించలేదా తమ్ముడు’.. మంత్రి నారా లోకేశ్ ఎమోషనల్ ట్వీట్
ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం మీడియాతో మాట్లాడారు. వచ్చే ఏడాది ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని, ఎవరితోనూ పొత్తు పెట్టుకోమని స్పష్టం చేశారు. హోంమంత్రి అమిత్ షాను ఉద్దేశించి కేజ్రీవాల్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం కేజ్రీవాల్ పై దాడి జరిగిన విషయం తెలిసిందే.. ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ.. అసలు నేను చేసిన తప్పు ఏంటి..? ఢిల్లీ శాంతిభద్రతల అంశాన్ని లేవనెత్తాను. అమిత్ షా ఈ విషయంలో చర్యలు తీసుకుంటారని ఆశించాను. కానీ, దానికి బదులు పాదయాత్రలో నాపైనే దాడి జరిగింది. ఓ వ్యక్తి నాపై ద్రావకం విసిరాడు. అది ప్రమాదకరం కాదు. కానీ, అది హానికరం కావొచ్చు. మేము ప్రజా సమస్యలను లేవనెత్తాము. మీకు వీలైతే గ్యాంగ్ స్టర్లను అరెస్టు చేయించండి. కానీ, మమ్మల్ని ఎందుకు లక్ష్యంగా చేసుకుంటున్నారు అని అరవింద్ కేజ్రీవాల్ ప్రశ్నించారు.
ఇదిలాఉంటే.. ఈ ఏడాది లోక్ సభ ఎన్నికల సమయంలో కూడా పంజాబ్ లో కాంగ్రెస్ తో పొత్తుకు ఆప్ నిరాకరించిన విషయం తెలిసిందే. 13 స్థానాల్లో ఆప్ అభ్యర్థులు ఒంటరిగా బరిలోకి దిగారు. అయితే, కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు లేకుండానే బరిలోకి దిగుతామని చెప్పింది. తాజాగా ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ కూడా ఇండియా కూటమితో పొత్తుకు వెళ్లమని, ఒంటరిగానే ఢిల్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని చెప్పారు.