AAP : చత్తీస్ గడ్‌‌పై ఆప్ నజర్, వచ్చే ఎన్నికల్లో పోటీ ?

ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత చత్తీస్ గడ్ లో 15 ఏళ్లుగా బీజేపీ అధికారంలో ఉండి హామీలను నెరవేర్చలేదని విమర్శించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు మార్పు కోరుకుని కాంగ్రెస్ కు...

AAP : చత్తీస్ గడ్‌‌పై ఆప్ నజర్, వచ్చే ఎన్నికల్లో పోటీ ?

Aap Punjab

Updated On : March 20, 2022 / 10:00 AM IST

AAP Chhattisgarh : పంజాబ్ లో విజయం సాధించిన తర్వాత ఆప్ ఫుల్ జోష్ లో ఉంది. ఇప్పటికే ఢిల్లీలో ప్రభుత్వాన్ని నడుపుతున్న ఆప్… పంజాబ్ రాష్ట్రంలో కూడా సర్కార్ ను ఏర్పాటు చేసింది. దీంతో ఇతర రాష్ట్రాల వైపు ఆప్ ఫోకస్ పెట్టింది. ఆయా రాష్ట్రాల్లో త్వరలో జరిగే ఎన్నికల క్రమంలో ఇప్పటి నుంచే కార్యాచరణను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో ఏప్రిల్ 14వ తేదీ నుంచి పాదయాత్రలు చేసేందుకు రూట్ మ్యాప్ ఖరారు చేస్తోంది. తాజాగా.. చత్తీస్ గడ్ రాష్ట్రం వైపు దృష్టి సారించింది. అక్కడ వచ్చే ఏడాది ఎన్నికలు జరుగనున్నాయి. ఎన్నికల్లో పోటీ చేయాలని ఆప్ నిర్ణయించినట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికలకు సన్నాహాలను ప్రారంభించడానికి ఆప్ పార్టీ సీనియర్ నేత, ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ ను రెండు రోజుల పర్యటనకు పంపాలని పార్టీ నిర్ణయించింది. గిరిజనుల ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

Read More : Punjab AAP Govt :పంజాబ్ లో ఆప్ ప్రభుత్వం కీలక నిర్ణయం..25,000 ఉద్యోగాల భర్తీకి కేబినెట్ నిర్ణయం

ఆప్ పూర్వాంచల్ వింగ్ ఇన్ చార్జి, బురారీ ఎమ్మెల్యే సంజీవ్ ఝాతో కలిసి రాయ్ 2022, మార్చి 20వ తేదీ ఆదివారం చత్తీస్ గడ్ కు చేరుకుంటారు. యాక్షన్ ప్లాన్ నిర్వహించడం, సభ్యత్వ నమోదుపై పార్టీ నాయకులకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఆదివారం చత్తీస్ గడ్ రాజధాని రాయ్ పూర్ లో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం విజయ్ యాత్రలో పాల్గొననున్నారు. పంజాబ్ రాష్ట్రంలో పార్టీ అఖండ విజయాన్ని పురస్కరించుకుని మార్చ్ ను ప్లాన్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోరాడాలని నిర్ణయించడం జరిగిందని, రాష్ట్ర ప్రజలు ప్రధానంగా యువత, మహిళలు ప్రభుత్వం పట్ల నిరాశతో ఉన్నారని ఆప్ ఢిల్లీ కన్వీనర్ రాయ్ తెలిపారు. ప్రజలు ఇక్కడ మార్పు కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు.

Read More : Punjab New AAP Cabinet : కొలువుదీరిన పంజాబ్‌ కొత్త మంత్రివర్గం.. 10 మంది మంత్రుల ప్రమాణస్వీకారం

ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత చత్తీస్ గడ్ లో 15 ఏళ్లుగా బీజేపీ అధికారంలో ఉండి హామీలను నెరవేర్చలేదని విమర్శించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు మార్పు కోరుకుని కాంగ్రెస్ కు పట్టం కట్టారన్నారు. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత తగాదాలతో పాటు, ప్రజల్లో తీవ్ర నిరాశ నెలకొందన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పాలనను చూసిన ప్రజలు మార్పును కోరుకుంటున్నారని వెల్లడించారు. 2018లో జరిగిన గత అసెంబ్లీ ఎన్నికల్లో చత్తీస్ గడ్ లో మొత్తం 90 స్థానాల్లో 85 స్థానాల్లో అభ్యర్థులను దింపాలని ఆప్ ప్రయత్నించింది. అయితే.. కనీసం ఖాతా తెరవడంలో ఆప్ విఫలం చెందింది. వచ్చే ఏడాదిలో జరిగే ఎన్నికల్లో ఆప్ ఎంతమంది అభ్యర్థులను నిలుపనుంది ? ప్రజలు ఆప్ ను ఆదరిస్తారా ? లేదా ? అనేది తెలుసుకోవాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.