Abhishek Banerjee : టీఎంసీ ఎంపీ, మమతా బెనర్జీ మేనల్లుడి కాన్వాయ్‌పై దాడి

టీఎంసీ ఎంపీ, మమతా బెనర్జీ మేనల్లుడైన అభిషేక్ బెనర్జీ కాన్వాయ్ పై సోమవారం దాడి జరిగింది.  డైమండ్‌ హర్బర్‌ టీఎంసీ ఎంపీ అభిషేక్‌ బెనర్జీ ఈరోజు త్రిపుర రాష్ట్రంలోని అగర్తలలో పర్యటించారు. 

Abhishek Banerjee : టీఎంసీ ఎంపీ, మమతా బెనర్జీ మేనల్లుడి కాన్వాయ్‌పై దాడి

Abhishek Banerjee

Updated On : August 2, 2021 / 5:27 PM IST

Abhishek Banerjee : టీఎంసీ ఎంపీ, మమతా బెనర్జీ మేనల్లుడైన అభిషేక్ బెనర్జీ కాన్వాయ్ పై సోమవారం దాడి జరిగింది.  డైమండ్‌ హర్బర్‌ టీఎంసీ ఎంపీ అభిషేక్‌ బెనర్జీ ఈరోజు త్రిపుర రాష్ట్రంలోని అగర్తలలో పర్యటించారు.  ఆయన పర్యటనలో ఉండగా బీజేపీ జెండాలు పట్టుకున్న కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఆయన కాన్వాయ్‌పై దాడి చేశారు. బీజేపీ నేతలే కావాలని తనపై దాడి చేయించారని అభిషేక్‌ బెనర్జీ తన ట్విట్టర్ ఎకౌంట్ లో ఆరోపించారు.

‘‘బీజేపీ నాయకత్వంలోని త్రిపురలో ప్రజాస్వామ్యం ఇలా ఉంది. విప్లవ్‌ దేవ్‌ మీరు రాష్ట్రాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లారు.. మిమ్మల్ని అభినందిస్తున్నాను’’ అంటూ తన కాన్వాయ్‌పై జరిగిన దాడికి సంబంధించిన వీడియోని  ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు.

వేరే రాష్ట్రంలో పర్యటిస్తున్న తమ ఎంపీ కారుపై దాడి చేయటాన్ని టీఎంసీ నాయకులు ఖండించారు. టీఎంసీ రాజ్యసభ ఎంపీ డెరెక్ ఓ బ్రెయిన్ అభిషేక్ బెనర్జీ కాన్వాయ్ పై జరిగిన దాడిని ఖండించటమే కాక ఈ విషయాన్ని పార్లమెంట్ దృష్టికి తీసుకువెళతానని అన్నారు. అభిషేక్ బెనర్జీ త్రిపురలో పర్యటిస్తూ ఉండటంతో అగర్తలలోబీజేపీ కార్యకర్తలు టీఎంసీ పోస్టర్ లను చించివేశారని టీఎంసీ నాయకులు ఆరోపించారు.