Supreme Court: కిడ్నీ ఇస్తుంటే బెయిల్ ఇవ్వొచ్చు.. మానవత్వంతో ఆలోచించండి -సుప్రీంకోర్టు

కిడ్నీలు దానం చేసేవారికి బెయిల్ ఇవ్వొచ్చని అభిప్రాయపడింది సుప్రీంకోర్టు.

Supreme Court: కిడ్నీ ఇస్తుంటే బెయిల్ ఇవ్వొచ్చు.. మానవత్వంతో ఆలోచించండి -సుప్రీంకోర్టు

Supreme Court

Updated On : October 18, 2021 / 1:05 PM IST

Supreme Court: కిడ్నీలు దానం చేసేవారికి బెయిల్ ఇవ్వొచ్చని అభిప్రాయపడింది సుప్రీంకోర్టు. ప్రాణాలు కాపాడే విషయంలో కిడ్నీ దానం చేసే వ్యక్తి ఆరోగ్యకరంగా ఉన్నాడని డాక్టర్లు భావిస్తే, తాత్కాలిక బెయిల్ కోసం కోర్టుని ఆశ్రయిస్తే, అంగీకారం తెలపొచ్చునని కోర్టు చెబుతుంది.

డ్రగ్స్ కేసులో జైల్లో ఉన్న నిందితుడు తండ్రికి కిడ్నీ ఇవ్వాలని భావిస్తున్నారు. కిడ్నీ ఇవ్వడానికి ఆరోగ్యంగా ఉంటే మాత్రం బెయిల్ ఇవ్వొచ్చని, బెయిల్ కోసం మధ్యప్రదేశ్‌ హైకోర్టును ఆశ్రయించాలని, హైకోర్టు కూడా ఈ విషయంలో మానవత్వంతో సానుభూతి చూపాలని కోరింది.

నేరం తీవ్రత దృష్ట్యా బెయిల్‌ ఇవ్వకూడదని తొలుత హైకోర్టు బెయిల్ నిరాకరించింది. అనారోగ్యానికి గురైన తండ్రిని చూసుకోవడానికి సోదరులు, బంధువులు ఉన్నారని చెబుతూ.. ధర్మాసనం బెయిల్ ఇచ్చేందుకు కోర్టు ఒప్పుకోలేదు.

అయితే, ‘‘తండ్రిని చూసుకోవడం కోసం కావు.. కిడ్నీ ఇవ్వడం కోసం ఈ కొడుకు అవసరం అని అభిప్రాయపడింది కోర్టు. కిడ్నీ ఇవ్వడానికి మిగిలిన కుమారులు, వారి భార్యలు, పిల్లలు అంగీకరించట్లేదు. కిడ్నీ ఇవ్వడానికి జైలులో ఉన్న కొడుకు ముందుకు వస్తున్నందున అందుకు తగ్గ ఏర్పాట్లు చేయాలి’’ అని కోర్టు తెలిపింది. ఇదే సమయంలో నిందితుడిపై కేసును ఆరు నెలల్లో పరిష్కరించాలని అభిప్రాయపడింది కోర్టు.