Actor Bobby Simhas Car Incident: ప్రముఖ నటుడు బాబీ సింహా కార్ యాక్సిడెంట్.. పుష్పరాజ్ అరెస్ట్, కారుతో 7 వాహనాలను గుద్దేశాడు, ముగ్గురికి గాయాలు
కారు ప్రమాదాన్ని కళ్లారా చూసిన వాహనదారులు భయబ్రాంతులకు గురయ్యారు. ఈ ప్రమాదంలో గాయపడిన ముగ్గురు వ్యక్తులను స్థానికులను వెంటనే ఆసుపత్రికి తరలించారు.

Actor Bobby Simhas Car Incident: ప్రముఖ నటుడు బాబీ సింహా కారు డ్రైవర్ బీభత్సం సృష్టించాడు. కారుతో యాక్సిడెంట్ చేశాడు. ఏడు వాహనాలను గుద్దేశాడు. ఈ ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి. శుక్రవారం సాయంత్రం చెన్నై అలండూర్ లో ఈ యాక్సిడెంట్ జరిగింది. మద్యం మత్తులో కారుని నడిపి ప్రమాదానికి కారణమైన బాబీ సింహా కారు డ్రైవర్ పుష్పరాజ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.
చెన్నై ఎయిర్ పోర్టుకి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో కారులో నటుడు బాబీ సంహా లేడని పోలీసులు తెలిపారు. డ్రైవర్ కంట్రోల్ లేడని, చాలా వేగంగా నడిపాడని ట్రాఫిక్ పోలీసులు చెప్పారు. వేగంగా దూసుకొచ్చిన కారు మూడు మోటర్ సైకిళ్లు, రెండు ఆటోలు, ఒక కారుని ఢీకొట్టి ఆగిపోయింది.
కారు ప్రమాదాన్ని కళ్లారా చూసిన వాహనదారులు భయబ్రాంతులకు గురయ్యారు. ఈ ప్రమాదంలో గాయపడిన ముగ్గురు వ్యక్తులను స్థానికులను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే, ఎవరి ప్రాణాలకు ప్రమాదం లేదని డాక్టర్లు చెప్పడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. పుష్పరాజ్ ను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. డ్రంకెన్ డ్రైవింగ్, ఓవర్ స్పీడ్, నిర్లక్ష్యంగా వాహనం నడిపినందుకు కేసు నమోదు చేశారు.
Also Read: ఇండియాకు ఎలాన్ మస్క్..! ప్రధాని మోదీతో మాట్లాడాక మస్క్ మామ బిగ్ అనౌన్స్ మెంట్..
2014లో వచ్చిన జిగర్ తాండ మూవీతో బాబీ సింహా ఫేమస్ అయ్యారు. తన నటనతో ఆయన మెప్పించారు. ఈ సినిమాకు గాను జాతీయ అవార్డు దక్కించుకున్నారు. బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ కేటగిరీలో అవార్డు వచ్చింది. కారు ప్రమాదానికి సంబంధించి నటుడు బాబీ సంహా ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు.
కారు ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు. సరైన వాహన పత్రాలు, ఇన్సూరెన్స్ ఉన్నాయా లేదా చెక్ చేస్తున్నారు. అలాగే అదనపు ట్రాఫిక్ ఉల్లంఘనలు ఏమైనా ఉన్నాయా అని ఆరా తీస్తున్నారు.
కమల్ హాసన్ నటించిన ఇండియా 2 సినిమాలో ప్రమోద్ కృష్ణస్వామి అనే సీబీఐ అధికారి పాత్రను పోషించారు నటుడు బాబీ సంహా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పుట్టిన బాబీ సింహా.. తమిళ ఫిలిమ్ ఇండస్ట్రీలో మంచి నటుడిగా గుర్తింపు పొందారు. పిజ్జా, సోదు కవ్వుమ్, బెంగళూరు నాటకల్, తిరుత్తు పాయలే 2 చిత్రాల్లో నటనకు గుర్తింపు పొందారు. తెలుగు, మలయాళం సినిమాల్లోనూ బాబీ సంహా నటించారు.
మరిన్ని ఇంట్రస్టింగ్ స్టోరీలు, అప్‌డేట్స్ కోసం 10టీవీ వాట్సాప్ చానల్‌ని ఫాలో అవ్వండి.. Click Here