డీఎంకే నేతృత్వంలోని కూటమిలో చేరిన కమల హాసన్ పార్టీ

Kamal Haasan: లోక్‌సభ ఎన్నికల్లో తాను, తన ఎంఎన్ఎం పోటీ చేయడం లేదని కమల హాసన్ ఈ సందర్భగా తెలిపారు.

డీఎంకే నేతృత్వంలోని కూటమిలో చేరిన కమల హాసన్ పార్టీ

Kamal Haasan

సినీనటుడు కమల హాసన్‌ పార్టీ ఎంఎన్ఎం తమిళనాడులోని అధికార డీఎంకే నేతృత్వంలోని కూటమిలో చేరింది. 2025 రాజ్యసభ ఎన్నికల్లో ఎంఎన్‌ఎంకు డీఎంకే ఒక స్థానాన్ని కేటాయిస్తున్నట్లు ప్రకటించింది. లోక్‌సభ ఎన్నికల్లో తాను, తన ఎంఎన్ఎం పోటీ చేయడం లేదని కమల హాసన్ ఈ సందర్భగా తెలిపారు.

డీఎంకే నేతృత్వంలోని కూటమికి అన్ని విధాలా సహకరిస్తామని కమల హాసన్ చెప్పారు. దేశం కోసమే తాము కలిశామని కమల హాసన్ చెప్పుకొచ్చారు. మక్కల్ నీది మయ్యం పార్టీని కమల హాసన్ 2018 ఫిబ్రవరి 21న స్థాపించారు. ఆ తర్వాత జరిగిన అన్ని ఎన్నికల్లో పోటీ చేస్తూ వస్తున్నారు. మరికొన్ని రోజుల్లో లోక్‌సభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కానుంది.

ఇదే సమయంలో డీఎంకే నేతృత్వంలోని కూటమిలో చేరుతున్నట్లు కమల హాసన్ ప్రకటించడం గమనార్హం. గతంలో ఆయన కాంగ్రెస్‌తో కలుస్తారన్న ప్రచారం కూడా జరిగింది. తమిళనాడు ఎన్నికల్లో ఎంఎన్ఎం రాణించలేకపోయింది. ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల నుంచి కూడా పూర్తిగా తప్పుకుంది.

టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వం.. ప్రతిపక్షాలకు మంత్రి పొన్నం కీలక సూచన