కమెడియన్ పై కొనసాగుతున్న విమానయాన సంస్థల నిషేధం…DGCA క్లారిటీ

  • Published By: venkaiahnaidu ,Published On : January 29, 2020 / 02:48 PM IST
కమెడియన్ పై కొనసాగుతున్న విమానయాన సంస్థల నిషేధం…DGCA క్లారిటీ

Updated On : January 29, 2020 / 2:48 PM IST

మంగళవారం(జనవరి-28,2020)ఇండిగో విమానంలో ప్రయాణసమయంలో ప్రముఖ టీవీ జర్నలిస్ట్ అర్నబ్ గోస్వామిపై వ్యక్తిగత దూషణలకు దిగిన ప్రమఖ స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రాపై మంగళవారం ఇండిగో ఎయిర్ లైన్స్ ఆరు నెలల ప్రయాణ నిషేధం విధించిన క్రమంలో ఇండిగో బాటలోనే ఎయిర్ ఇండియా,స్పైస్ జెట్,గోఎయిర్ లు కునాల్ పై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. నిషేధ సమయంలో ఆయా సంస్థలకు చెందిన విమానాల్లో ప్రయాణించడం ఉల్లంఘన కిందకు వస్తుందని డైరక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(DGCA) బుధవారం(జనవరి-29,2020)తెలిపింది. అయితే నిసేధం రూల్స్ కి విరుద్ధంగా లేకపోయినప్పటికీ..ఇలాంటి నిర్ణయం తీసుకోబడేటప్పుడు ఓ ప్రాసెస్ ఉందని,దానిని ఫాలో అవ్వాల్సి ఉంటుందని డీజీసీఏ వర్గాలు తెలిపాయి.

ఒక ఫిర్యాదు అందిన తరువాత…30రోజుల్లోగా ఆ విషయంపై విచారణ చేపట్టేందకు అంతర్గత కమిటీని ఏర్పాటు చేయాలని DGCA వెబ్‌సైట్‌లో సివిల్ ఏవియేషన్ రిక్వైర్మెంట్స్(CAR) పేర్కొంది. కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని పౌర విమానయాన మంత్రిత్వ శాఖలోని అప్పీలేట్ బాడీ, న్యాయస్థానంలో అప్పీల్ చేయవచ్చు. ఈ సమయంలో కునాల్ కమ్రా ఎదుర్కొంటున్నట్లుగా ఆరు నెలల నిషేధం కాకుండా ప్రయాణికులు 30రోజుల తాత్కాలిక బ్యాన్ ఎదుర్కొంటారు.

డీజీసీఏ ప్రకారం…ప్యాసింజర్లపై నిషేధం విధించే లిస్ట్ లో మూడు కేటగిరీలు ఉన్నాయి. అందులో ఒకటి..రెచ్చగొట్టేందుకు,ఇబ్బంది కలిగించేందుకు ప్రమాదకర ప్రవర్తన కలిగి ఉండటం(అంతరాయం కలిగించే ప్రవర్తన). దీనికి గరిష్ట శిక్ష మూడు నెలల నిషేధం మాత్రమే. రెండవది…శారీరకంగా దూషించే ప్రవర్తణ..దీనికి ఆరు నెలల నిషేధం. మూడవది…విమానానికి,ప్రయాణికులకు ముప్పుగా ఉండటం. దీనికి రెండు సంవత్సరాల నిషేధాన్ని కలిగి ఉంటారు.

అయితే కునాల్  విషయంలో వేగంగా స్పందించి నిషేధం విధించిన విమానయాన సంస్థలు గతంలో ఇలాంటి వైఖరే ప్రదర్శించిన పలువురి విషయంలో ఈ విధంగా నిషేధాజ్ణలు విధించలేదు. విమానంలో సీటు విషయంలో స్పైస్ జెట్ సిబ్బంది,ప్రయాణికులతో వాదనలకు దిగిన సాధ్విప్రగ్యాసింగ్ పై ఆ గొడవ వీడియో వైరల్ అయినప్పటికీ ఎలాంటి బ్యాన్ లు విధించలేదు. 2017లో శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ ఎయిర్ ఇండియా సిబ్బందిపై దాడి చేశారని కేవలం రెండు వారాలు మాత్రమే ఆయనపై నిషేధం విధించారు.