బీజేపీ కొత్త జాతీయాధ్యక్షుడు ఎవరు? ఎన్నిక ప్రక్రియ ఎలా ఉంటుందో తెలుసా?
కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునేలోపే సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టనుంది.

భారతీయ జనతా పార్టీ జాతీయాధ్యక్షుడిగా జేపీ నడ్డా కాల వ్యవధి ముగియనుంది. ఇప్పుడు జేపీ నడ్డా కేంద్ర మంత్రిగానూ ఉన్న విషయం తెలిసిందే. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పదవీకాలాన్ని జూన్ 2024 వరకు పొడిగించినట్లు గత ఏడాది కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు.
జేపీ నడ్డా 2020 జనవరిలో మూడేళ్ల పదవీకాలంతో ఆ పార్టీ అధ్యక్షుడు అయ్యారు. ఆయన పదవీకాలం గత ఏడాది ముగియడంతో సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నడ్డా పదవీకాలాన్ని 2024 వరకు పొడిగించారు. ఇప్పుడు ఆయన పార్టీ అధ్యక్షుడి పదవి నుంచి దిగిపోవాల్సి ఉండడంతో కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునే పనిలో పడింది బీజేపీ.
డిసెంబరులోపు..
ఈ ఏడాది డిసెంబరులోపు బీజేపీ కొత్త జాతీయాధ్యక్షుడిని నియమించాలని భావిస్తోంది. ఆగస్టు 1 నుంచే ప్రక్రియ మొదటుకానుంది. కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునేలోపే సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టనుంది. రాష్ట్రాల పార్టీ యూనిట్లను బలపర్చాలని భావిస్తోంది.
సభ్యత్వ నమోదు కార్యక్రమం సెప్టెంబరు 15 వరకు జరగనుంది. అలాగే, క్రియాశాల సభ్యత్వ నమోదు సెప్టెంబరు 16 నుంచి సెప్టెంబరు 30 వరకు ఉండనుంది. అక్టోబరు 1 నుంచి అక్టోబరు 15 మధ్య క్రీయాశీల సభ్యత్వ పరిశీలన ఉంటుంది. బీజేపీలో ప్రతి సభ్యుడు ప్రతి తొమ్మిదేళ్లకు ఒకసారి సభ్యత్వాన్ని పునరుద్ధరించుకోవాల్సి ఉంటుంది.
ఈ ఏడాది ప్రధానితో పాటు పార్టీ అధ్యక్షుడు, పార్టీ నేతలు అందరూ తమ సభ్యత్వాన్ని పునరుద్ధరించుకోవాల్సి ఉంటుంది. అలాగే, నవంబర్ 1 నుంచి 15 వరకు బీజేపీ మండల అధ్యక్షుల కోసం ఎన్నికలు ఉంటాయి. నవంబర్ 16 నుంచి 30 వరకు జిల్లా అధ్యక్ష ఎన్నికలను నిర్వహిస్తారు.
ఆ తర్వాత రాష్ట్ర కౌన్సిల్, సెంట్రల్ కౌన్సిల్ సభ్యులను ఎన్నుకుంటారు. అనంతరం రాష్ట్ర అధ్యక్షుల ఎంపిక ప్రక్రియ ప్రారంభమవుతుంది. డిసెంబర్ 1న ఇది ప్రారంభం కానుంది. 50 శాతం రాష్ట్రాల్లో ఈ ఎన్నికలు పూర్తి అవ్వగానే పార్టీ జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు ప్రక్రియ ప్రారంభం అవుతుంది.
Also Read: ‘చంద్రబాబుని అడగండి’.. ఎన్డీఏ ప్రభుత్వం పడిపోతుందా అన్న ప్రశ్నకు చిదంబరం కీలక వ్యాఖ్యలు