MLA Angada Kanhar : ఏజ్.. జస్ట్ నెంబర్ మాత్రమే.. 58ఏళ్ల వయసులో టెన్త్ పాసైన ఎమ్మెల్యే

వయసు కేవలం సంఖ్య మాత్రమే.. కృష్టి, పట్టుదల ఉంటే జీవితంలో సాధించలేనిది ఏదీ లేదని వయసు మీద పడిన పలువురు వ్యక్తులు నిరూపించారు. తాజాగా అది మరోసారి ప్రూవ్ అయ్యింది. 58ఏళ్ల వయసులో ఓ ఎమ్మెల్యే టెన్త్ పాస్ అయ్యారు.

MLA Angada Kanhar : వయసు కేవలం సంఖ్య మాత్రమే.. చదువుకి, ఏజ్ కి సంబంధం లేదని.. కృష్టి, పట్టుదల ఉంటే జీవితంలో సాధించలేనిది ఏదీ లేదని వయసు మీద పడిన పలువురు వ్యక్తులు నిరూపించారు. తాజాగా అది మరోసారి ప్రూవ్ అయ్యింది. 58ఏళ్ల వయసులో ఓ ఎమ్మెల్యే టెన్త్ పాస్ అయ్యారు. ఎట్టకేలకు తన కోరికను నెరవేర్చుకున్నారు.

వివరాల్లోకి వెళితే.. ఒడిశా కంధమాల్ జిల్లా పుల్బాని ఎమ్మెల్యే(బీజేడీ) అంగాడ కన్హార్ టెన్త్ పాస్ అయ్యారు. ఆయన వయసు 58ఏళ్లు. 1978లో ఆయన చదువు ఆపేశారు. ఆ తర్వాత రాజకీయ నాయకుడిగా తనకంటూ ఓ గుర్తింపు పొందారు. కానీ టెన్త్ పూర్తి చేయాలనే ఆశ ఆయనకు అలాగే ఉండిపోయింది. తాజాగా ఓపెన్ స్కూల్ సర్టిఫికెట్ నిర్వహించిన పరీక్షలు రాశారు. ఆ ఫలితాలు వచ్చేశాయి. ఎమ్మెల్యే అంగాడ టెన్త్ పరీక్షల్లో పాసయ్యారు. ఫలితాల్లో ఆయన బీ1 గ్రేడ్ సాధించారు. 500 మార్కులకు గాను 364 మార్కులు తెచ్చుకున్నారు. చదువుకి వయసుతో సంబంధం లేదని ఆయన మరోసారి నిరూపించారు.

MLA Angad Kanhar : 58 ఏళ్ల వయస్సులో పదో తరగతి పరీక్ష రాసిన ఎమ్మెల్యే

రుజాంగి హై స్కూల్ లో పదో తరగతి విద్యార్థులతో కలిసి ఏప్రిల్ 29న ఆయన టెన్త్ పరీక్షలు రాశారు. వాటి ఫలితాలు రాగా ఆయన పాస్ అని తెలిసింది. టెన్త్ పరీక్షల్లో పాస్ అయినట్టు తెలియగానే ఆ ఎమ్మెల్యే ఆనందంతో పొంగిపోయారు. వెంటనే గుడికి వెళ్లి దైవ దర్శనం చేసుకున్నారు. టెన్త్ పరీక్షల్లో పాస్ అయిన ఎమ్మెల్యేను ఆయన సహచరులు, స్నేహితులు, స్థానికులు అభినందనలతో ముంచెత్తారు.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

టెన్త్ పరీక్షలకు హాజరయ్యేందుకు తనను ప్రోత్సహించిన వారందరికీ ఎమ్మెల్యే అంగాడ థ్యాంక్స్ చెప్పారు. అంతేకాదు తాను స్టడీస్ ని కొనసాగిస్తానని కూడా చెప్పారు.మొత్తం 5లక్షల 17వేల 847 మంది విద్యార్థులు పరీక్షల్లో పాస్ అయ్యారు. వారిలో ఈ ఎమ్మెల్యే ఒకరు. కుటుంబ సమస్యల కారణంగా 1978లో తాను మధ్యలోనే చదువు ఆపేశానని, టెన్త్ పరీక్షలు రాలేకపోయానని ఎమ్మెల్యే చెప్పారు.

గ్రేట్ : 105 ఏళ్ల బామ్మ..4వ తరగతి పూర్తి

ఎమ్మెల్యే వయసు ప్రస్తుతం 58ఏళ్లు. సాధారణంగా రిటైర్ అయ్యే వయసు అది. విధుల నుంచి వైదొలిగి లైఫ్ ని ఎంజాయ్ చేసే సమయం. కానీ, ఎమ్మెల్యే అంగాడ మాత్రం రాజకీయాల్లో యాక్టివ్ గా ఉన్నారు. ఎమ్మెల్యే అంగాడ వృత్తిరిత్యా రైతు. 2019 ఎన్నికల్లో బీజేడీ టికెట్ పై పుల్బాని అసెంబ్లీ నుంచి పోటీ చేసి గెలిచారు. అంగాడ ఎమ్మెల్యేగా పోటీ చేయడం ఇదే తొలిసారి.

ట్రెండింగ్ వార్తలు