Rakesh Tikait : అప్పటివరకు రైతు ఉద్యమం ఆగదు..టికాయత్ క్లారిటీ

మూడు నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేసినంత మాత్రాన తాము ఆందోళన విరమించేది లేదని రైతు సంఘాలు చెబుతున్నారు. తమ డిమాండ్లన్నీ నెరవేరే వరకు నిరసన కొనసాగుతుందని

Rakesh Tikait : అప్పటివరకు రైతు ఉద్యమం ఆగదు..టికాయత్ క్లారిటీ

Rk

Updated On : November 20, 2021 / 9:38 PM IST

Rakesh Tikait  మూడు నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేసినంత మాత్రాన తాము ఆందోళన విరమించేది లేదని రైతు సంఘాలు చెబుతున్నారు. తమ డిమాండ్లన్నీ నెరవేరే వరకు నిరసన కొనసాగుతుందని,వ్యవసాయ చట్టాలను రద్దు చేయడం మొదటి దశ మాత్రమే అని రైతు నాయకుడు రాకేష్ టికైట్ శనివారం సృష్టం చేశారు.

శనివారం ఓ ఇంటర్వ్యూలో టికాయత్ మాట్లాడుతూ..”మూడు వ్యవసాయ చట్టాలు రద్దు చేసినందుకు మేము సంతోషిస్తున్నామ., అయితే ఇది అంతం కాదు. కనీస మద్దతు ధర(MSP) కోసం చట్టపరమైన హామీపై కేంద్రం చర్చను ప్రారంభించాలి”అని అన్నారు.

ఇక, సంఘవిద్రోహ శక్తులు రైతుల నిరసనను హైజాక్ చేయడంపై అడిగిన ప్రశ్నకు…వ్యతిరేకశక్తులను ఎదుర్కోవటానికి ఇంటెలిజెన్స్ ఏమి చేస్తోంది,రైతుల ఉద్యమాన్ని ఎవరూ హైజాక్ చేయలేరు. ఇది పూర్తిగా కేంద్రం వైఫల్యం, వారు ఈ ఆందోళనను చాలా కాలం పాటు కొనసాగడానికి అనుమతించారు అని సమాధానమిచ్చారు.

మరోవైపు,ప్రతిపక్ష పార్టీలు రైతుల నిరసనను అడ్వాంటేజ్ తీసుకోవడంపై అడిగిన ప్రశ్నకు..ప్రతిపక్షాలు కేంద్రం చర్యను ప్రశ్నించడంలో నాకు ఎలాంటి తప్పు కనిపించడం లేదు. ప్రశ్నలు అడగడం ప్రతిపక్షాల పని అని టికాయత్ అన్నారు.

ALSO READ Sooryavanshi: బాలీవుడ్‌కి బ్రీతింగ్ ఇచ్చిన సూర్యవన్షీ సక్సెస్!