ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం
ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. వివిధ ప్రభుత్వ సంస్థలకు అరువుపై టికెట్లను నిలిపివేసింది.

ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. వివిధ ప్రభుత్వ సంస్థలకు అరువుపై టికెట్లను నిలిపివేసింది.
ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ప్రభుత్వ రంగ సంస్థలకు షాక్ ఇచ్చింది. ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. వివిధ ప్రభుత్వ సంస్థలకు అరువుపై టికెట్లను నిలిపివేసింది. ఎయిర్ ఇండియాకి ప్రభుత్వ సంస్థలు రూ.268 కోట్ల బకాయిపడ్డాయి. ఈ నేపథ్యంలో అధికారికంగా ప్రయాణించేందుకు విమాన టికెట్లను ఇవ్వబోమని తేల్చి చెప్పింది. ఎయిరిండియా చరిత్రలో తొలిసారిగా ఇలాంటి నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రూ. 10లక్షలకు పైగా బకాయి పడిన సంస్థలకు టికెట్లను ఎయిర్ ఇండియా నిరాకరించాలని నిర్ణయించింది. పాత బకాయిలు చెల్లించేంత వరకు టికెట్లను ఇవ్వకూడదని ఎయిర్ ఇండియా నిర్ణయం తీసుకుంది.
బకాయిల ఎగవేతదారుల జాబితాను వైమానిక సంస్థ రూపొందించింది. ఈ జాబితాలో సీబీఐ, ఐబీ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, ఇండియన్ ఆడిట్ బోర్డ్, కంట్రోలర్ ఆఫ్ డిఫెన్స్ అకౌంట్స్, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, సెంట్రల్ లేబర్ ఇనిస్టిట్యూట్ అండ్ స్టమ్స్ కమిషనర్ ఈ జాబితాలో ఉన్నాయి. ఈ సంస్థల అధికారులు అధికారిక ప్రయాణాలకు ఎయిర్ ఇండియా టికెట్లు కొనుగోలు ద్వారా వివిధ ప్రభుత్వ సంస్థల నుంచి ఎయిర్ ఇండియాకు రావాల్సిన మొత్తం బకాయిల విలువ రూ .268 కోట్లుగా ఉంది.
గత నెలలో ఎయిర్ ఇండియా ఆర్థిక విభాగం ప్రభుత్వ సంస్థల బకాయిలపై ఒక డేటా తయారు చేసింది. ఈ క్రమంలో రూ .10 లక్షలకు పైగా బకాయిలు ఉన్నవారిని ‘క్యాష్ అండ్ క్యారీ’ (నగదు చెల్లించినవారికి మాత్రమే) ద్వారా టికెట్లు జారీ చేయాని నిర్ణయించామని ఎయిర్ ఇండియా అధికారి వెల్లడించారు. లోక్‌సభ సహా ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కొన్ని మినహాయింపులు ఇచ్చామని తెలిపారు.
ఈ నేపథ్యంలో గత కొన్నివారాల్లో సుమారు రూ. 50 కోట్లను రికవరీ చేశామని తెలిపారు. కంట్రోలర్ ఆఫ్ డిఫెన్స్ అకౌంట్స్ రూ .5.4 కోట్లు, సీబీఐ రూ.95లక్షలు ఈడీ రూ.12.8 లక్షల, లోక్‌సభ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎంఎస్‌ఏకు రూ .2.2 కోట్ల మేర ఎయిర్ ఇండియాకు బకాయి పడ్డాయి.