Air Vistara Fined Rs.70 Lakh : ఎయిర్‌ విస్తారా విమానయాన సంస్థకు రూ. 70 లక్షల జరిమానా

ఎయిర్‌ విస్తారా విమానయాన సంస్థకు రూ. 70 లక్షల జరిమానా విధిస్తూ షాక్ ఇచ్చింది డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ). దేశంలోని ఈశాన్య ప్రాంతాల్లో కనీస విమాన సర్వీసులను నిర్వహించనందుకు..నిబంధనలను పాటించనందుకు ఎయిర్ విస్తారాకు జరిమానా విధించింది.

Air Vistara Fined Rs.70 Lakh : ఎయిర్‌ విస్తారా విమానయాన సంస్థకు రూ. 70 లక్షల జరిమానా

Air Vistara Fined Rs.70 Lakh

Updated On : February 6, 2023 / 9:47 PM IST

Air Vistara Fined Rs 70 Lakh  : ఎయిర్‌ విస్తారా విమానయాన సంస్థకు రూ. 70 లక్షల జరిమానా విధిస్తూ షాక్ ఇచ్చింది డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ). 2022 ఏప్రిల్ లో దేశంలోని ఈశాన్య ప్రాంతాల్లో కనీస విమాన సర్వీసులను నిర్వహించనందుకు..నిబంధనలను పాటించనందుకు గత అక్టోబర్ లో ఎయిర్ విస్తారాకు జరిమానా విధించింది. దీంతో ఎయిర్ విస్తారా సంస్థ జరిమాని చెల్లించింది అని డీజీసీఏ అధికారి ఒకరు తెలిపారు.

విస్తారా ప్రతినిధి స్పందిస్తూ.. విస్తారా గత కొన్నేళ్లుగా RDG (రూట్ డిస్పర్సల్ గైడ్‌లైన్స్)ని అనుసరిస్తోందని..నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను 2022 అక్టోబర్‌లో డీజీసీఏ విమానయాన సంస్థపై జరిమానా విధించిందని తెలిపారు. వాస్తవంగా చెప్పాలంటే ప్రతి సెక్టార్‌లో కనీస విమానాల సంఖ్య గురించి ఎయిర్‌లైన్ కంపెనీలకు దిశ నిర్దేశం చేస్తుంది డీజీసీఏ. ఈ నిబంధనలను పాటించి తీరాల్సిందే. ఈ నిబంధనలు పాటించే విధంగా డీజీసీఏ చాలా కఠినంగా వ్యవహరిస్తోంది. ఈక్రమంలో నిబంధనలను పాటించనందుకు ఎయిర్ విస్తారాకు రూ.70లక్షలు జరిమానా విధించింది డీజీసీఏ.

ఉత్తర పశ్చిమ బెంగాల్ లోని బాగ్ డోగ్రా విమానాశ్రయాన్ని మూసివేయడటం వల్ల కొన్ని విమాన సర్వీసుల్ని రద్దు చేయాల్సి వచ్చిందని ఏప్రిల్ 2022 విమానంలో హైడ్రాలిక్ వైఫల్యం వల్ల ఇటువంటి పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. సాంకేతిక లోపం కారణంగా విమానం వెనక్కి వెళ్లవలసి వచ్చిందని తెలిపారు. కాగా.. కొన్ని రోజుల క్రితం డిజిసిఎ ఎయిర్ ఇండియాపై కూడా రూ. 30 లక్షల జరిమానా విధించింది. విమానంలో మహిళతో అనుచితంగా ప్రవర్తించినందుకు ఎయిర్ ఇండియాకు ఈ జరిమానా విధించారు.