మాజీ సీఎం అజిత్ జోగి కొడుకు అరెస్ట్

ఫోర్జరీ కేసులో ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం అజిత్ జోగి కుమారుడు,మాజీ ఎమ్మెల్యే అమిత్ జోగి(42)ని ఇవాళ పోలీసులు అరెస్టు చేశారు. 2013 ఎన్నికల సమయంలో అమిత్ జోగి.. తన అఫిడవిట్‌లో తన పుట్టిన ఫ్లేస్ ని, తేదీని, కులాన్ని తప్పుగా ప్రస్తావించారన్న ఆరోపణలు ఉన్నాయి. 2013 అసెంబ్లీ ఎన్నికల సమయంలో అమిత్ జోగి.. తన అఫిడవిట్‌లో అబద్దాలు చెప్పారంటూ.. మర్వాహి స్థానం నుంచి ఆయనపై పోటీ చేసి ఓడిపోయిన బీజేపీ నాయకురాలు సమీరా పైక్రా ఈ ఏడాది ఫిబ్రవరిలో గౌరీలా పోలీసులకు కంప్లెయింట్ చేశారు.
అమిత్ జోగి 1977లో టెక్సాస్‌లో జన్మిస్తే.. అఫిడవిట్‌లో మాత్రం 1978లో ఛత్తీస్‌గఢ్‌లోని గౌరీలా గ్రామంలో జన్మించినట్లు తెలిపినట్లు సమీరా తన ఫిర్యాదులో తెలిపింది. తన కులాన్ని ఎస్టీగా జోగి పేర్కొన్నట్లు ఆమె తెలిపారు. సుదీర్ఘ విచారణ అనంతరం ఇవాళ పోలీసులు జోగిని అరెస్టు చేశారు. జోగిని కోర్టులో హాజరుపర్చి. కోర్టు ఆదేశాల ప్రకారం చర్యలు తీసుకుంటారమని పోలీసులు తెలిపారు.
తన కుమారుడిపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని అజిత్ జోగి అన్నారు. ఛత్తీస్ ఘడ్ లో అధికార కాంగ్రెస్ కక్షపూరిత రాజకీయాలు చేస్తోందన్నారు. సీఎం భూపేష్ భాగల్ మతిస్థిమితం కోల్పోయారన్నారు. అమిత్ పై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని మూడు నెలల క్రితం హైకోర్టు చెప్పిందని ఆయన అన్నారు.