Kashmir Files: కశ్మీర్ ఫైల్స్ మాత్రమే కాదు లఖీంపూర్ ఫైల్స్ కూడా తీయండి – అఖిలేశ్ యాదవ్

సమాజ్‌వాదీ పార్టీ ముఖ్య నేత అఖిలేశ్ యాదవ్.. ద కశ్మీర్ ఫైల్స్ అనే బాలీవుడ్ సినిమా సపోర్ట్ చేస్తున్నందుకు భారతీయ జనతా పార్టీపై విమర్శలకు దిగారు. కశ్మీర్ లోయలో జరిగిన హింసాత్మక ఘటనల..

Kashmir Files: కశ్మీర్ ఫైల్స్ మాత్రమే కాదు లఖీంపూర్ ఫైల్స్ కూడా తీయండి – అఖిలేశ్ యాదవ్

Kashmir Files

Updated On : March 16, 2022 / 7:15 PM IST

Kashmir Files: సమాజ్‌వాదీ పార్టీ ముఖ్య నేత అఖిలేశ్ యాదవ్.. ద కశ్మీర్ ఫైల్స్ అనే బాలీవుడ్ సినిమా సపోర్ట్ చేస్తున్నందుకు భారతీయ జనతా పార్టీపై విమర్శలకు దిగారు. కశ్మీర్ లోయలో జరిగిన హింసాత్మక ఘటనల పట్ల సినిమా తీయగలిగితే లఖీంపూర్ ఖేరీ ప్రాంతంలో జరిగిన అల్లర్లపై కూడా సినిమా తీయాలని అన్నారు.

2021 అక్టోబరు 4న ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారని, కేంద్ర మంత్రి అజయ్ తేనీ కొడుకు ఆశిష్ మిశ్రా ఆరుగురిపై నుంచి కార్ నడిపాడని వ్యాఖ్యానించారు. అందులో నలుగురు రైతులు కూడా ఉన్నారని, కశ్మీర్ ఫైల్స్ సినిమా గురించి మాట్లాడుతూ మీడియా ముందు ప్రస్తావించారు.

బీజేపీ వల్ల జరిగిన హింస, నిరుద్యోగం, అభివృద్ధిల గురించి కూడా సినిమా తీయాలని సూచించారు.

Read Also : ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమాకి అరుదైన గౌరవం..

ప్రధాని నరేంద్ర మోదీ.. ద కశ్మీర్ ఫైల్స్ సినిమాను ప్రశంసిస్తూ.. చరిత్రను యథావిధిగా చిత్రీకరించడం చాలా మంచి విషయమని అన్నారు. హోం మంత్రి అమిత్ షా బాలీవుడ్ సినిమాని సత్యానికి బోల్డ్ రిప్రజెంటేటివ్ గా అభివర్ణించారు. సినిమాలో కశ్మీరీ పండిట్స్ పడిన కష్టాలు, భరించలేని బాధలను హైలెట్ చేశారని వివరించారు.