చైనాకు చుక్కలే : రష్యా నుంచి భారత్ కు యుద్ధ విమానాలు

సరిహద్దుల్లో చైనాతో ఉద్రిక్తతల వేళ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రతిష్టాత్మక విస్తరణకు ప్రణాళికలు వేస్తోంది. రక్షణ మంత్రిత్వ శాఖ ముందు IAF ఒక ప్రతిపాదనను ఉంచింది. రష్యా నుంచి 33 యుద్ధ విమానాలను కొనుగోలు చేయడానికి ఐఎఎఫ్ ప్రయత్నిస్తోంది. వీటిలో 12 సుఖోయ్ 30 ఎంకేఐ, 21 మిగ్ -19 ఫైటర్ జెట్‌లు ఉంటాయి. ఈ ఒప్పందం 6000 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా.
భారత వైమానిక దళం మరియు దాని పైలట్లు సుఖోయ్ 30 యుద్ధ విమానాలతో సుపరిచితులు, ఎందుకంటే అవి దశాబ్దాలుగా భారత వైమానిక దళంలో భాగంగా ఉన్న విషయం తెలిసిందే. ఇండియన్ ఎయిర్ ఎటాక్ లోన్ సుఖోయ్ ముందువరుసలో వుంది. . IAF ఇప్పటికే ఫ్రాన్స్ నుండి రాఫెల్ ఫైటర్ జెట్లను కొనుగోలు చేస్తోంది.
లడక్ గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణలో 20 మంది భారత సైనికులు చనిపోవడంతో కేంద్రం యుద్ధ విమానాల కొనుగోలుపై నిర్ణయం తీసుకుంది. ఓ పక్క చర్చలు జరుపుతుండగానే ఈ నెల 15న చైనా బలగాలు వాస్తవాధీన రేఖ దాటి వచ్చేందుకు యత్నించాయి. అడ్డుకున్న భారత జవాన్లపై చైనా బలగాలు పాశవికంగా దాడి చేసి చంపేశాయి.
ఘటనను తీవ్రంగా తీసుకున్న కేంద్రం సైనికుల బలిదానాలను వృధా కానీయబోమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హెచ్చరించారు. చైనాకు గట్టి గుణపాఠం చెప్పాలని దేశవ్యాప్తంగా డిమాండ్లు వస్తున్నాయి. ప్రతిపక్షాలు కూడా చైనాకు బుద్ది వచ్చేలా గట్టి చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరుతున్నాయి. రేపటి అఖిల పక్ష సమావేశంలో తీసుకునే నిర్ణయాల ఆధారంగా చైనాపై చర్యలుంటాయని భావిస్తున్నారు. ఇందులో భాగంగానే త్రివిధ దళాలను అలర్ట్ చేశారు.