IPC, CrPCలో సవరణలు…కమిటీ ఏర్పాటు చేశామన్న షా

దేశవ్యాప్తంగా మూకదాడుల,హత్యలు పెరిగిపోతున్న విషయం తెలిసిందే. అయితే వీటిని డీల్ చేసేందుకు IPC,CRPCలో అవసరమైన సవరణలను సూచించేందుకు కేంద్రప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసినట్లు ఇవాళ(డిసెంబర్-4,2019)రాజ్యసభలో తెలిపారు. క్వచ్చన్ అవర్ లో వరుస ప్రశ్నలకు ఆయన సమాధానాలిస్తూ…అనుభవం కలిగిన దర్యాప్తు అధికారులు,పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ని సంప్రదించి ఏపీసీ,సీఆర్ పీసీలో మార్పులపై సిఫార్సుల కోసం ఇప్పటికే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు,గవర్నర్లకు లేఖ రాసినట్లు అమిత్ షా తెలిపారు.
బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్(BPR&D) ఆధ్వర్యంలో ఐపీసీ,సీఆర్ పీసీలో మార్పుల కోసం కమిటీ ఏర్పాటు చేయబడిందని,కమిటీ సిఫార్సుల అనంతరం సవరణలపై తాము పని ప్రారంభిస్తామని షా తెలిపారు. సుప్రీంకోర్టు ఆర్డర్స్ ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఐపీసీ,సీఆర్ పీసీలో మార్పులు చేస్తుందని ఆయన తెలిపారు. మూక హత్యలను సమర్థవంతంగా పరిష్కరించడానికి కొత్త చట్టాన్ని రూపొందించాలని సుప్రీంకోర్టు జూలై 17 తీర్పులో పార్లమెంటును కోరింది.